బాలయ్య అనిల్ రావిపూడి సినిమా నుండి అదిరిపోయే అప్డేట్.. బాలయ్యకు మరో హిట్ పక్కా..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు రావడంతో ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. బాలకృష్ణ ఈ సినిమాతో మరోసారి ఆఖండ ను మించి మరో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటారని ఆయన అభిమానులు ఎంతో నమ్మకంగా ఉన్నారు.

Anil Ravipudi and Nandamuri Balakrishna's NBK 108 first look is out

బాలయ్య ఈ సినిమా తర్వాత వరుస‌ విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి తో తన తర్వాత సినిమాను కన్ఫామ్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ కూడా రేపు ఉదయం 9 గంటల 36 మొదలు పెట్టనున్నారని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. అప్డేట్ ఏమిటంటే ఈ సినిమా టైటిల్‌ను షూటింగ్ మొదలుపెట్టిన రోజునే ప్రకటించాలని దర్శకుడు అనిల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా టైటిల్ కూడా ఎంతో సరికొత్త గా కన్ఫామ్ చేసినట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో బాలయ్య 55 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి పాత్రలో నటించబోతున్నాడు. అలాగే ఈ సినిమాలో బాలయ్య కూతురుగా పెళ్లి సందడి ఫ్రేమ్ శ్రీ లీల నటించబోతుంది. ఇక ఈ సినిమాలో కూడా బాల‌య్య రెండు విభిన్నమైన క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను బాలయ్య పాత సినిమాలకు భిన్నంగా ఎంతో స్టైలిష్ గా అనిల్ తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాతో బాలకృష్ణ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి.

 

Share post:

Latest