అమీర్‌పేట్ లో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్.. స్పెషాలిటీస్ తెలిస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే..!

మన టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు ఇటు సినిమాలతో పాటు వ్యాపార‌ రంగంలో కూడా ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు ఏషియన్ గ్రూప్ తో కలిసి ఏఎంబి మాల్‌ను ఎంతో సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నారు. రీసెంట్‌గా తన భార్య నమ్రతా పేరుతో హోటల్ బిసినెస్ ని కూడా మొదలుపెట్టారు.

Allu Arjun Aaa Cinemas In Ameerpet Soon To Launch - Sakshi

వీరితోపాటు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఏషియన్ సినిమాస్ పార్ట్నర్ షిప్ తో పలు మల్టీప్లెక్స్ కూడా రన్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు వీరితో పాటు ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కూడా ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఆయన ఏషియన్ గ్రూప్ తో కలిసి తన పేరుతో హైదరాబాదులోని అమీర్‌పేటలో ఓ భారీ మల్టీప్లెక్స్ ను ఏర్పాటు చేస్తున్నారు.

Allu Arjun Aaa Cinemas In Ameerpet Soon To Launch - Sakshi

ఇప్పటికే ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తయి ఓపెనింగ్ కు రెడీగా ఉంది. త‌ర్వార‌లోనే ఈ మల్టీప్లెక్స్ ను అల్లు అర్జున్ స్టార్ట్ చేయనున్నారు. ఇక ఇప్పుడు ఈ మల్టీప్లెక్స్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ బిజినెస్ తో అల్లు అర్జున్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడు చూడాలి.

Share post:

Latest