నాగార్జునకి 2023 కలిసిరాదా? సినిమాలు లేవట?

టాలీవుడ్ కింగ్ నాగార్జున అంటే ఎవరో తెలియని తెలుగు ప్రజానీకం ఉండరని చెప్పుకోవాలి. ఆయన హీరోగా ఈ సంవత్సరం రెండు మూడు సినిమాలు వచ్చాయి. ఈ మధ్యనే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ‘ది ఘోస్ట్’ సినిమా ఎలాంటి ఫలితం వచ్చిందో తెలిసిన విషయమే. కాగా ఈ కథ కోసం నాగార్జున చాలా కసరత్తులు చేసారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయినా శ్రమంతా వృద్ధాగానే పోయినందుకు నాగ్ ఆలోచనలో పడ్డాడట. ఈనేపథ్యంలో కింగ్ నుంచి కొత్త కమిట్ మెంట్ వివరాలు రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని భోగట్టా.

కాగా కొత్త సినిమాల విషయంలో నాగ్ చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవిని కూడా ఓ ఐడియా అడిగి తెలుసుకోవాలని చూస్తున్నారట. ఈ క్రమంలోనే తమిళ దర్శకుడు విక్రమ్. కె. కుమార్ చెప్పిన కథను మొదట చిరు విన్న తరువాతనే నాగార్జున వింటానని చెప్పడం జరిగిందట. కాగా విక్రమ్ మరియు నాగ్ మధ్య బాండింగ్ గురించి అందరికీ తెలిసినదే. అలాగే మరోవైపు ఓ కొత్త రచయిథ పట్ల కూడా నాగ్ సానుకూలంగానే ఉన్నట్లు తెలిసింది.

ఈ రకంగా నాగార్జున తన తదుపరి సినిమాల విషయంలో ఖచ్చితత్వంగా ఉండాలని చూస్తున్నాడట. అలాగే తాజాగా మోహన్ రాజా కూడా ఓ కథని వినిపించాడని టాక్ నడుస్తోంది. అయితే ఇంకా ఈ విషయాలపైన అధికారికంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఈ నేపథ్యంలో వీటన్నింటిపై కొత్త ఏడాది 2024 లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అందుకే 2023 నాగార్జున కేలండర్ ఖాళీగా వుండనుందని భోగట్టా. ఏదిఏమైనా కింగ్ నాగార్జునకి ఓ సాలిడ్ హిట్ పడాలని ఆ పెద్దమ్మని వేడుకుందాం.