కృతి సనన్.. ఈ బాలీవుడ్ భామ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన `1 నేనొక్కడినే` సినిమాతో కృతి సనన్ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చి.. అక్కడ స్టార్ హోదాను అందుకుంది. ఇక చాలా కాలం తర్వాత ఈ భామ తెలుగులో ఓ సినిమాకు సైన్ చేసింది. అదే `ఆదిపురుష్`.
పాన్ ఇండియా స్థార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్.. నాకు కాబోయే భర్త ఎలా ఉండాలో వివరించండి.
`చిన్నప్పుడు, ప్రేమంటే తెలియని వయసులో క్రష్‌లు ఉండడం సహజమే. నేను కూడా రెండు మూడు సార్లు ఆ అనుభూతిలో విహరించాను. అలాగే కాబోయే భర్త ఎలా ఉండాలనే దానిపై నాకు స్పష్టమైన అవగాహన ఉంది. కాబోయే భర్త నాకంటే పొడవు ఉండాలి. అందగాడు కావాలి. మంచి మాటకారై ఉండాలి. తనతో ఎప్పటికీ నాకు బోర్ కొట్టకూడదు.` అంటూ కృతి సనన్ చెప్పుకొచ్చింది. మరి అటువంటి అబ్బాయి కృతి సనన్‌కు దొరుకుతాడో..లేదో.. చూడాలి.