స్టార్ హీరోల కెరియర్ లో ట్రెండ్ సెట్ చేసిన సినిమాలను ఈ మధ్యకాలంలో తిరిగి మళ్ళీ థియేటర్లోకి రీ రిలీజ్ చేస్తూ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నారు. రీ రిలీజ్ ట్రెండ్ అనేది ఇప్పుడు భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది.. ఇక తమ అభిమానుల హీరో సినిమా కేవలం ఒక్క షో పడినా కూడా ఆడియన్స్ హౌస్ఫుల్ అయ్యేలా థియేటర్లకు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో డిస్టిబూటర్స్ చాలామంది పాత సినిమాలు కొనుగోలు చేసి మరి రీ రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ తరహా ప్లాను మాత్రం అన్ని వర్గాల హీరోలకు వర్కౌట్ కావడం లేదు.
మహేష్, పవన్ కళ్యాణ్ వంటి హీరోల సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతున్నాయి ఇప్పుడు చిరంజీవికి సంబంధించిన మరొక సినిమాను కూడా మళ్లీ విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గీత ఆర్ట్స్ బ్యానర్లు 1991లో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రాన్ని విజయ బాపినీరు దర్శకత్వంలో తెరకెక్కించి అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసింది. హీరోయిన్గా విజయశాంతి అద్భుతమైన నటన ప్రదర్శించింది.
ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీన విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అయితే కేవలం ఈ సినిమా నీ ఒక షోని ప్రదర్శించాలనే ఆలోచనలు చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమాకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన షోలు వేసినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అందచేతనే ఇప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమా కేవలం ఒక్క షో నే ప్రదర్శించాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాల పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మరి అభిమానులు ఎలా ఆదరిస్తారో చూడాలి.