టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో తమన్నా కూడా ఒకరు. మూడున్నర పదుల వయసు వస్తున్నా కూడా తమన్నా తన కెరియర్ ఎంతో విజయవంతంగా కొనసాగిస్తూ ప్రస్తుతం యువ హీరోయిన్లకు షాక్ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. రీసెంట్గా సత్యదేవాతో గుర్తుందా శీతాకాలం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది తమన్నా. ఆ సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ఆ సినిమాలో తమన్నా క్యారెక్టర్ కు ప్రాధాన్యత లేకపోవడంతో ఆమెకు ఆ సినిమా మైనస్ అయింది.. అందుకే ఆ సినిమా ప్లాప్ అయింది. అయినా తమన్నా వరుస స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా కొనసాగుతుంది. తమన్నా రెమ్యూనరేషన్ కూడా రెండు కోట్ల రూపాయల లోపే తీసుకొనడంతో ఆమెకు ఆఫర్లు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ఆమె చుట్టూ క్యూ కడుతున్నారు.
ఇక ఇప్పుడు ప్రస్తుతం ప్రముఖ నటి జయమాలిని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమన్నా అంటే మా ఆయనకు చాలా ఇష్టమని సెన్సేషనల్ కామెంట్లు చేసింది. తమన్నా ప్రస్తుతం హీరోయిన్గా ఐటెం సాంగ్స్ లో కూడా నటించడం బాగుందని జయమాలిని చెప్పుకొచ్చింది. మా ఆయనకు తమన్నాతో పాటు కాజల్ అంటే కూడా చాలా ఇష్టమని జయమాలిని చెప్పుకొచ్చింది.
వీటితోపాటు జయమాలిని టాలీవుడ్ లో ఉన్న పలువురు హీరోలపై సెన్సేషనల్ కామెంట్లు కూడా చేసింది. ప్రస్తుతం ఉన్న హీరోలలో తనకి ఎన్టీఆర్, అల్లు అర్జున్ అంటే ఇష్టమని ఆమె చెప్పింది. ప్రస్తుతం జయమాలిని అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.