NTR ద్వారా అది పొందలేకపోయాను అని బాధపడుతున్న సమీర్?

సమీర్ అంటే మీకు వెంటనే గుర్తుకు రాకపోవచ్చు, కానీ సీరియల్ యాక్టర్ సమీర్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేస్తాడు కదూ. సీరియల్స్ ద్వారానే కాకుండా సినిమాలలో కూడా అడపాదడపా కొన్ని విలక్షణ పాత్రలు పోషించిన సమీర్ అంటే తెలుగు సీరియల్ ప్రేక్షకులను మంచి గురి. అంతేకాకుండా చాలా సినిమాలలో స్నేహితుల ఫ్రెండ్ క్యారెక్టర్ లో చక్కగా నటించేవారు. దూరదర్శన్ లో ప్రసారమైన ఋతురాగాలు, శాంతినివాసం వంటి సీరియల్స్ తో సమీర్ కి మంచి పేరు వచ్చింది.

ఆమధ్య బిగ్ బాస్ సీజన్ వన్ లో కంటెస్టెంట్ గా సమీర్ ఏ రేంజ్ లో అలరించాడో చెప్పాల్సిన పనిలేదు. ఇక అసలు విషయానికొస్తే సమీర్ తాజాగా ఒక ఇంటర్వ్యూ వేదికగా మాట్లాడుతూ అనేక విషయాలు పేర్కొన్నారు. బేసిగ్గా వైజాగ్ వాసి అయినటువంటి సమీర్ కి అంత ఈజీగా సీరియళ్ళలో వేషాలు రాలేదు. ఒకే సమయంలోనే 2 సినిమాలలో అవకాశాలు రావడం వలన సమీర్ హైదరాబాద్ రావడం జరిగిందట. ఆ కాలంలో సెల్ ఫోన్స్ లేని కారణంగా తాను ఒక మంచి ఆఫర్ పోగొట్టుకున్నాను అని కూడా తెలిపాడు.

ఈ సందర్భంగా ఆయన NTR ప్రస్తావన తీసుకొచ్చి ఓ గమ్మత్తైన విషయం చెప్పుకొచ్చారు. హైదరాబాద్, రవీంద్ర భారతిలో అవార్డు ఫంక్షన్స్ అనేవి తరచూ జరుగుతూ ఉంటాయి కదా. ఒకసారి ఓ ఫంక్షన్ కోసమని సమీర్ అక్కకి వెళితే గేటు వద్దే తనని ఆపేశారట. సంకల్పం అనే సినిమాలో నటించానని చెప్పినా వినలేదట. మొదటి గేటులో బ్రతిమలాడితే పంపారట. గాని లోపలికి వెళ్లాలంటే ఇంకో గేటు దాటాలట. అక్కడ ఎంత అడిగినా పంపించలేదట. లోపలేమో సమీర్ పేరుని పిలిచారట. దురదృష్టవశాత్తు ఆపేరు తనకి వినబడినా లోపలికి వెళ్లలేకపోయాడట సమీర్. దాంతో NTR చేతుల మీదుగా అవార్డు తీసుకోలేకపోయాను అంటూ ఎమోషనల్ అయ్యాడు.

Share post:

Latest