మహేష్-త్రివిక్రమ్ సినిమా షూటింగ్ పై క్లారిటీ ఆ రోజున వస్తుందా..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ హీరోగా పొడుగు కాలా సుందరి పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న క్రేజీ మూవీకి మాటల‌ మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. SSMB28 అనె వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ భారీ యాక్షన్ మూవీని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది.

త్రివిక్రమ్‌- మహేష్ బాబు కాంబోలో 12 సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు కూడా ఉన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ యొక్క సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కావాల్సి ఉండగా రీసెంట్గా మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో.. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొన్నాళ్లపాటు వాయిదా వేసినట్లు తెలుస్తుంది.

తండ్రి మరణంతో ఒక్కసారిగా మహేష్ తో పాటు సూపర్ స్టార్ అభిమానులు, ఘట్టమనేని కుటుంబం మొత్తం ఎంతో విషాదంలో మునిగిపోయింది. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పరిస్థితులు అన్నీ చక్కబడిన తర్వాత ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన వివరాలు ఫిక్స్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్ర‌ యూనిట్‌ సినిమాని వచ్చే సంవత్సరం వేసవి కానుకగా ఏప్రిల్ 28న‌ విడుదల చేస్తున్నట్లు ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు. ఇక మరి ఇప్పుడు ఈ సినిమా అనుకున్న విధంగా షూటింగ్ పూర్తి చేసుకుని అనుకున్న డేట్ కి ప్రేక్షకులు ముందుకు వస్తుందో లేదో అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు.

Share post:

Latest