సాధారణంగా ఎవరి జీవితంలోనైనా సరే వివాహం అనేది మెమోరబుల్ అండ్ రెస్పాన్సిబుల్ మూమెంట్ అని చెప్పవచ్చు. అయితే ఇద్దరు దంపతుల మధ్య సఖ్యత కుదరకపోతే పరస్పరం అంగీకారం చేత ఇద్దరు విడిపోవడం వంటివి జరుగుతూ ఉంటుంది. అదే నటీనటుల విషయానికి వస్తే..మాత్రం వాళ్ల జీవితాలను ప్రతి ఒక్కరు కూడా ఒక భూతద్దం పెట్టి చూస్తూ ఉంటారని చెప్పవచ్చు. గడిచిన కొద్ది రోజుల క్రితం హీరో ధనుష్ ,రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య విడిపోతున్నారనే ప్రకటన తెలియజేసి అందరికి షాక్ ఇచ్చారు.
అయితే ఇన్ని సంవత్సరాలు అన్యోన్యంగా ఉన్న వీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం వీరి పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకి వీరిద్దరూ కలవబోతున్నారు అంటూ ప్రకటించారంటు వార్తలు వినిపించాయి.. ఇక్కడితో ఈ కథ ముగిసిందని చెప్పవచ్చు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇలాగే తన భార్య లత కు విడాకులు ఇవ్వాలనుకున్నారట. అప్పట్లో రజినీకాంత్ తన భార్యతో దూరంగా ఉండేవారని పలు మీడియాలో కూడా వార్తలు వినిపించాయి.
అసలు విషయంలోకి వెళ్తే 1985 లో రజనీకాంత్ భార్య లత ఇద్దరు కూడా వేరువేరుగా ఉండేవారట. దీంతో తమిళ మీడియాలో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు తమిళ పత్రికలో చాలా వైరల్ గా మారాయి.రజనీకాంత్ పూర్తిగా హరేకృష్ణ కు అంకితమైపోవడంతో రజనీకాంత్ విడాకుల వ్యవహారానికి మరింత తావు ఇచ్చిందని సమాచారం. దీంతో రజినీకాంత్ స్పందిస్తూ కొన్ని వీబేధాల వల్ల తన భార్య లతతో వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నారని తెలియజేశారు.అంతకుమించి మా మధ్య ఎలాంటి ద్వేషం లేదని తెలిపారు. ఆ తర్వాత కొన్ని రోజులకు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తొలగిపోయి తిరిగి కలుసుకోవడం జరిగింది. రజనీకాంత్ తన భార్యతో కలవడానికి ముఖ్య కారణం రాఘవేంద్ర స్వామి పాత్ర అన్నట్లుగా సమాచారం. ఆ సమయంలోనే రజినీకాంత్ రాఘవేంద్ర అనే సినిమాని తలకెక్కిస్తున్నారు.