అల్లరి నరేష్ సక్సెస్ ను కంటిన్యూ చేస్తాడా..!!

సినీ ఇండస్ట్రీలోకి మొదట కామెడీ చిత్రాలతో తన టాలెంట్ నిరూపించుకున్న నటుడు అల్లరి నరేష్ ఒకే ఏడాదిలో ఎన్నో సినిమాలను విడుదల చేస్తూ ఉండేవారు. అయితే ఈ మధ్యకాలంలో తన హవా అంతగా కొనసాగించలేకపోవడంతో ఏడాదికి ఒక్క సినిమా కూడా విడుదల కావడం చాలా గగనంగా మారిపోయింది. దాదాపుగా నాలుగైదు సంవత్సరాల తర్వాత నాంది సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు అల్లరి నరేష్. ఇప్పుడు తాజాగా ఇట్లు మారేడుపల్లి ప్రజానికం అనే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుతో రావడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించారు. హీరోయిన్గా ఆనంది నటిస్తున్నది.

itlu maredumilli prajaneekam release date, Allari Naresh కొత్త సినిమా  రిలీజ్ డేట్ లాక్.. ఎలక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో మూవీ - itlu maredumilli  prajaneekam movie gets a new release date - Samayam Telugu
ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని కూడా చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. ఈ సినిమా ముందుగా నవంబర్ 11న విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా రెండు వారాలు ఆలస్యంగా నవంబర్ 25వ తేదీన థియేటర్లోకి రాబోతున్నట్లు అఫీషియల్ గా ఒక పోస్టర్ తో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ చిత్రం రూరల్ బ్యాక్ డ్రాప్లో అల్లరి నరేష్ ఒక ఎలక్షన్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు.

Allari Naresh Next Film Release Date Pushed | cinejosh.com

అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న మరొక చిత్రం ఉగ్రమ్. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని విజయ్ కనక మేడల దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. నాంది సినిమా తర్వాత మళ్లీ ఈ హీరో డైరెక్టర్ దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో అంచనాల పెరిగిపోయాయి. మరి ఈ సినిమాలతో అల్లరి నరేష్ తన సక్సెస్ను కొనసాగిస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Share post:

Latest