టాలీవుడ్ సీనియర్ కమెడియన్ సుధాకర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్లో తన సినీ కెరియర్ ప్రారంభించిన సుధాకర్ అక్కడ కమలహాసన్, ఎంజీఆర్, శివాజీ గణేషన్ వంటి అగ్ర హీరోలతో పోటీపడి సినిమాలు తీసి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడ స్టార్ హీరోగా ఉన్న సమయంలోనే తెలుగు ఇండస్ట్రీకి వచ్చి కమెడియన్గా, క్యాటర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించారు. ఆయన ఇప్పటివరకు తెలుగు, కన్నడ, తమిళ్ భాషల్లో దాదాపు 600కు పైగా సినిమాల్లో నటించారు.
ఆయన కోలీవుడ్లో హీరోగా ఎక్కువ సినిమాలలో స్టార్ హీరోయిన్ రాధికతో కలిసి నటించారు. వీరిద్దరూ కలిసి ఏకంగా కోలీవుడ్లో 18 సినిమాలకు పైగాా నటించారు. వీరిద్దరూ కలిసి ఎక్కువ సినిమాలలో నటించడం వల్ల వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని ఆ టైంలో చాలా వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రచారంపై సుధాకర్ చాలాసార్లు క్లారిటీ ఇవ్వటం జరిగింది. నాకు 1983లో పెద్దలు కుదిర్చిన అమ్మాయితో వివాహం జరిగింది. నేను రాధికతో సినిమాలో మాత్రమే నటించని ఆవిడ నాకు స్నేహితురాలు అంతే… మా ఇద్దరి మధ్య ఏమీ లేదు.. అని సుధాకర్ చెప్పాడు.
సినిమా పరిశ్రమ అంటేనే రూమర్లు వస్తూ ఉంటాయి. కోలీవుడ్లో రాధికతో ఎక్కువ సినిమాలు చేయటం వల్ల ఆమెతో కలిసి ఉండటంతో ఇలాంటి వార్తలు వచ్చాయని.. కానీ మేము వాటిని పట్టించుకోలేదని.. ఇంకా నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు కేవలం నేను కాఫీ మాత్రమే ఎక్కువగా తాగుతానని సుధాకర్ అన్నారు. ఎప్పుడైనా ఏ పార్టీకి వెళ్లిన ఒక గ్లాస్ బీరు మాత్రమే తాగే వాడినని అంతకుమించి నాకు ఏ చెడు అలవాట్లు లేవని.. ముఖ్యంగా ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటానన్నాడు.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి నాకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చాయని.. చావు అంచల వరకు వెళ్ళొచ్చానని సుధాకర్ అన్నారు. ప్రస్తుతం ఈ సీనియర్ నటుడు సుధాకర్ అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ తనను ప్రేక్షకులు మర్చిపోకుండా చూసుకుంటున్నాడు. రాధిక కూడా కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ ను పెళ్లి చేసుకొని ఆనందంగా ఉంటుంది. ఈమె ఇప్పుడు కోలీవుడ్ లో తెలుగులో కూడా వరుస సినిమాలు చేసుకుంటూ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతుంది.