`స‌లార్‌`లో ప్ర‌భాస్ తో సంద‌డి చేయ‌బోతున్న రౌడీ.. ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే!?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో `స‌లార్‌` ఒక‌టి. కేజీఎఫ్ సినిమాతో నేష‌న‌ల్ వైడ్ గా పాపుల‌ర్ అయిన క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. హోంబలే ఫిలిమ్స్ బ్యాన‌ర్ పై విజయ కిరాగందుర్ ఈ సినిమాని అత్యంత భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో ప్ర‌భాస్ కు జోడీగా శ్రుతి హాహ‌న్ న‌టిస్తోంది. అలాగే జ‌గ‌ప‌తిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్ లో ప్ర‌త్యేకంగా వేసిన సెట్ లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజ్ న్యూస్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. అదేంటంటే.. ఈ చిత్రంలో ప్ర‌భాస్ తో రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ సంద‌డి చేయ‌బోతున్నాడ‌ట‌. స‌లార్ సినిమా రెండు భాగాలుగా రానుంద‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ చిత్రంలో ప్ర‌భాస్ సోద‌రుడి పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ కనిపించ‌బోతున్నాడ‌ట‌.

స‌లార్ క్లైమాక్స్‌లో విజ‌య్‌ను ప‌రిచ‌యం చేసి.. రెండో భాగంలో ఆయ‌న పాత్ర‌ను హైలెట్ చేయ‌బోతున్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికి తోడు ప్రభాస్ `సలార్` లుక్ తరహాలోనే విజయ్ సెట్ లో బ్లూ కలర్ హాఫ్ టీషర్ట్ లో కనిపిస్తున్న ఫొటో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మ‌రి నిజంగా స‌లార్ లో విజ‌య్ న‌టిస్తే ఫ్యాన్స్‌కి పూన‌కాలు ఖాయ‌మ‌ని అంటున్నారు.

Share post:

Latest