ఇక సింగిల్‌గా ప‌ని కాదు.. కొత్త రూట్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌?!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గత కొంతకాలం నుంచి వరుస ప్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. అసలు `గీత గోవిందం` తర్వాత విజయ్ దేవరకొండ హిట్ ముఖమే చూడలేదు. రీసెంట్‌గా ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన `లైగ‌ర్` ఎలాంటి ఫలితాన్ని అందుకుందో తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.

 

దీంతో విజ‌య్ దేవరకొండ హిట్టు కోసం తన తదుపరి చిత్రమైన `ఖుషి`ని త్వరగా ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని ఆరాట‌ప‌డుతున్నారు. శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న కారణంగా ఆమె షూటింగ్లో పాల్గొనలేకపోతుంది. దీంతో ఖుషి సినిమా ఇప్పట్లో విడుదల అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

ఇక సింగల్ గా పని కాదని డిసైడ్ అయిన విజయ్ దేవరకొండ.. కొత్త రూట్ లో వెళ్లేందుకు డిసైడ్ అయ్యాడ‌ట‌. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ మల్టీ స్టార్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అది కూడా ఓ మలయాళ సినిమా అని అంటున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చేయ‌బోతున్న `వృషభ` సినిమాలో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడట.

 

నందకిషోర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా క‌థ తండ్రి, కొడుకుల మ‌ధ్య న‌డుస్తుంది. అయితే ఇందులో మోహన్ లాక్‌ కొడుకుగా విజయ్ కనిపించబోతున్నాడని.. అతడి పాత్ర సినిమాలో ఎంతో కీలకంగా ఉంటుందని అంటున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా వ‌స్తుంద‌ట‌. మ‌రి సోలోగా హిట్ కొట్ట‌లేక‌పోతున్న విజ‌య్‌.. ఈ మ‌ల్టీస్టార‌ర్ తో అయినా స‌క్సెస్ ఎక్కుతాడా..లేదా.. అన్న‌ది చూడాలి.

Share post:

Latest