ప్ర‌ముఖ ఓటీటీకి `వీర సింహారెడ్డి`.. సాలిడ్ ధ‌ర ప‌లికిన డిజిట‌ల్‌ రైట్స్‌!?

నట‌సింహం నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. అదే `వీర సింహారెడ్డి`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

కన్నడ నటుడు దునియా విజయ్ విల‌న్ గా చేస్తుంటే.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను పోషించింది. మాస యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.

 

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే మేకర్స్ వీరసింహారెడ్డి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను విక్రయించారు. ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ మూవీని సొంతం చేసుకుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 11 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి వీర సింహారెడ్డి డిజిటల్ రైట్స్ సాలిడ్ ధ‌ర పలికిందనే చెప్పాలి. మరి ఈ మూవీ థియేట్రిక‌ల్ బిజినెస్ ఏ స్థాయిలో జరుగుతుందో చూడాల్సి ఉంది.

Share post:

Latest