ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి దిగంతాలకు చేరింది. ఇక ఇప్పుడిప్పుడే తెలుగులో పేరు తెచ్చుకుంటున్న కొంతమంది హీరోను వారి శరీరానికే కాకుండా బుర్రకు కూడా పని చెబుతున్నారు. అదేనండి… రైటింగ్, డైరెక్షన్ వంటి సెక్షన్లలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అందుకే వాళ్ళనుండి క్వాలిటీ సినిమాలు వస్తున్నాయి. అవును, కొంత మంది హీరోలు తెర మీద కనిపించడమే కాకుండా.. మెగా ఫోన్ పట్టుకొని తెర వెనుక కూడా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. సొంతంగా కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ రాసుకోవడమే కాకుండా మెగా ఫోన్ పట్టుకొని దర్శకత్వ బాధ్యతలు కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
అలాగే మరికొందరు సినిమా నిర్మాణం వైపు కూడా అడుగులు వేస్తున్నారు. ఓవరాల్ గా 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన కలిగి ఉండి.. మల్టీ టాలెంటెడ్ అని మనవాళ్ళు నిరూపించుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా చుస్కుంటు ఎక్కడ విన్నా డైరెక్టర్ కమ్ యాక్టర్స్ గా రిషబ్ శెట్టి మరియు ప్రదీప్ రంగనాథన్ ల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. రిషబ్ తన స్వీయ దర్శకత్వంలో ‘కాంతార’ వంటి చిత్రాన్ని తెరకెక్కించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో సినిమా తీసి 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాడు.
అలాగే తమిళ్లో తీసుకుంటే ‘లవ్ టుడే’ అనే సినిమా బంపర్ హిట్ అయింది. ఈ సినిమా ఇక్కడ కూడా డబ్ అయి మంచి వసూళ్లు రాబడుతోంది. 5 కోట్లతో నిర్మించిన ఈ మూవీ 75 కోట్లకు పైగా కలెక్షన్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు ప్రదీప్ రంగనాథన్. ఇక మన తెలుగులో తీసుకుంటే అడివి శేష్ నుండి విశ్వక్ సేన్ వరకూ అనేకమంది హీరో కమ్ డైరెక్టర్ గా దుమ్ము దులుపుతున్నారు. ‘ఫలక్ నుమా దాస్’ సినిమాతో విశ్వక్ సేన్, ‘క్షణం’ ‘గూఢచారి’ ‘మేజర్’ వంటి సినిమాలతో అడివి శేష్.. ‘డీజే టిల్లు’తో సిద్దు.. ఇలా అనేకమంది ఇక్కడ రాణిస్తున్నారు.