టాలీవుడ్ లో వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న క్రేజీ భామలు వీరే..!

ఏ సినిమా పరిశ్రమలోనైనా హీరోయిన్లు తమ కెరియర్‌ సాఫీగా కొనసాగించాలంటే నటన అందం అభినయంతో పాటు కొంత అదృష్టం కూడా కలిసి రావాలి.. ఏ హీరోయిన్ అయీన తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంటే తర్వాత వరస ఆఫర్లు వస్తాయి. ఆ సినిమాలు కూడా విజయం సాధిస్తే ఆ హీరోయిన్ ను గోల్డెన్ లెగ్ హీరోయిన్ అంటారు. ఇక ఈ క్రమంలోనే కొంద‌రు హీరోయిన్లు వరుస అపజ‌యాలను అందుకోవటం వల్ల‌ వారిని ఐరన్ లెగ్ అని ముద్ర వేస్తారు. అలా వారికి సినిమా అవకాశాలు కూడా రాకుండా పోతాయి. ఈ ఇమేజ్ కు దూరంగా ఉండి దశాబ్ద కాలంగా త్రిష, అనుష్క, కాజల్, తమన్నా, వంటి కొందరు హీరోయిన్లు మాత్రమే చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. వీరి తరువాత వచ్చిన ఇప్పటి తరం హీరోయిన్ల‌ కెరియర్ వారి విజయాల మీదే ఆధారపడి ఉంది.

Tamannaah Bhatia Vs Anushka Shetty Vs Trisha Krishnan: Which South Diva Has  the Perfect Best Belly Navel? Choose Now | IWMBuzz

ఇక ప్రస్తుతం ఇప్పుడు ఉన్న‌ కొందరు హీరోయిన్లు మాత్రం వరుసగా నాలుగు విజయాలు అందుకొని తర్వాతే వెంటనే నాలుగు అపజయాలు వస్తే వారికి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఈ కోవలోకి టాలీవుడ్ లో ఉన్న ముగ్గురు స్టార్ హీరోయిన్ లు విజయాల కోసం ఎంతో ఈగరగా వెయిట్ చేస్తున్నాఆ హీరోయిన్ లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

పూజా హెగ్డే:
ఈ పొడుగు కాళ్ళ సుందరి టాలీవుడ్ లో వరస విజయాలు అందుకుని స్టార్ హీరోయిన్ స్టేట‌స్‌ను దక్కించుకుంది. పూజ టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోల అందరితో నటించింది. కానీ ఈ ముద్దుగుమ్మకు ఈ సంవత్సరం వరుస అపజయాలు వచ్చాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని పాన్ ఇండియా హీరో ప్రభాస్ కు జంటగా నటించిన రాధేశామ్‌ సినిమా డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబోలో వచ్చిన ఆచార్యలో రామ్ చరణ్ కు జంటగా నటించింది. ఈ సినిమా కూడా చిరంజీవి కెరీర్ లోనే అత్యంత డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. రెండు సినిమాలు కూడా పూజకి సక్సెస్ అందించలేకపోయాయి. ప్రస్తుతం పూజా హెగ్డే మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా మీద తన ఆశలన్నీ పెట్టుకుంది.

కృతి శెట్టి:
ఈ బెంగళూరు భామ తన మొదటి సినిమా ఉప్పెనతో అదిరిపోయే హిట్‌ అందుకుంది. తొలి సినిమాతోనే భారీ స్టార్ డమ్‌ను దక్కించుకుంది. తర్వాత వరుస సినిమాలో న‌టించింది. ఇప్ప‌టికే వ‌రుస‌గా మూడు డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకుని తన కెరియర్‌ను కష్టాల్లో పడేసుకుంది. ప్రస్తుతం కృతి శెట్టి నాగచైతన్యతో కస్టడీ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలని గట్టి పట్టుదల మీద ఉంది.

Keerthy Suresh Photoshoot Stills in Red Saree - LinksInd

కీర్తి సురేష్:
ఈ మలయాళీ ముద్దుగుమ్మ తెలుగులో మహానటి సినిమాతో అదిరిపోయే నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు ఈమెకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. తర్వాత వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసినా క్రేజ్ రాలేదు. రీసెంట్‌గా మ‌హేష్‌తో చేసిన సర్కారు వారి పాట సినిమా వరకు కీర్తి సురేష్ కు హిట్‌ పడలేదు. మెగాస్టార్ భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లిగా నటిస్తుంది. నాని హీరోగా వస్తున్న దసరా సినిమాలో కూడా కీర్తి సురేష్ హీరోన్‌గా నటిస్తుంది. ఈ రెండు సినిమాలతో ఎలాగైనా విజయాలు అందుకోవాలని కీర్తి సురేష్ ప్రయత్నిస్తోంది.

Share post:

Latest