యాంకర్ శ్రీముఖి గురించి తెలుగు కుర్రకారుని అడిగితే బాగా చెప్తారు. ఎందుకంటే శ్రీముఖి అంటే మనోళ్ళకి క్రష్ కాబట్టి. తెలుగులో వున్న మంచి యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఆమె మొదట ‘అదుర్స్’ అనే కార్యక్రమంలో వ్యాఖ్యాతగా ప్రవేశించింది. అలాగే 2012 లో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాతో వెండితెర రంగ ప్రవేశం కూడా చేసింది. ఇక ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో ఏకంగా కథానాయిక అయిపోయింది. దాంతో ఈ బొద్దుగుమ్మ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
అప్పుడప్పుడు సినిమాలు చేసే శ్రీముఖి ఫుల్ టైం మాత్రం టీవీ షోలు చేస్తుంటుంది. అలాగే శ్రీముఖి ఎప్పటికప్పుడు హాట్ ఫొటో షూట్స్ తో సెగలు రేపుతోంది కూడా. అయితే ఈ ఈ రాములమ్మ తాజాగా గోవా తీరంలో రెచ్చిపోయి ఫోటోలు దిగింది. గ్లామర్ డోసును మరింత పెంచుతూ అక్కడ అందాల ప్రదర్శన చేస్తోంది. కోలా బీచ్‌లోని ఎంజాయ్ చేస్తూ అభిమాలకు గ్లామర్ ట్రీట్ అందించింది. ఒక్కసారి ఇక్కడ వున్న ఫోటోలు చూస్తే మీకే అర్ధం అవయిపోతుంది. అవును, అక్కడి బీచుల్లో క్షణం తిరిక లేకుండా గడుపుతూ తడి ఆరని అందాలతో అభిమానులను మత్తెక్కిస్తోంది.
ఇక శ్రీముఖి పర్సనల్ లైఫ్ విషయానికొస్తే స్వస్థలం నిజామాబాద్ అని తెలిసినదే కదా. తండ్రి రాం కిషన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పని చేస్తున్నారు. ఇక తల్లి లత బ్యూటీషియన్. ఈమెకు శుశ్రుత్ అనే తమ్ముడు కూడా వున్నాడు. మొన్నీమధ్య అతడిని కూడా పరిచయం చేయాలని చూసింది. కానీ ఎందుకో కుదరలేదు. ఓ మంచిరోజు చూసుకొని తమ్ముడిని కూడా బుల్లితెరకు పరిచయం చేసే పనిలో పడింది శ్రీముఖి. కాగా ఇన్ స్టాలో రోజురోజుకూ ఆమె ఫాలోవర్స్ సంఖ్య పెరిగితోంది.