ఎన్టీఆర్ తో కృష్ణ తల్లి నాగరత్నమ్మ ఈ అరుదైన కలయకకు.. సంబంధించిన ఫొటోస్ వైరల్..!!

టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు ప్రేక్షకులను వదిలి మ‌ర‌ణించి వారం రోజులు గడుస్తుంది. నవంబర్ 15 తెల్లవారు జామున విన్నఈ షాకింగ్ వార్త నుండి ఇంకా బయటికి రావటం కష్టంగానే ఉంది. అయితే గత కొద్దిరోజులుగా మీడియా, సోషల్ మీడియాతో పాటు ఎక్కడ చూసినా, విన్న కృష్ణ ప్రొఫెషన్, పర్సనల్ లైప్‌కు సంబంధించిన విషయాలు బాగా వైరల్ అవుతున్నాయి.. ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు.. కొన్ని అరుదైన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..


కృష్ణ హైదరాబాద్ లో స్థాపించిన పద్మాలయ స్టూడియోస్ 21 నవంబర్ 1983న ప్రారంభమైంది. ఈనెల 21కి ఈ స్టూడియోస్ పెట్టి 39 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక ఈ స్టూడియోను ప్రారంభించింది కృష్ణ అభిమాన నటుడు నటరాత్న ఎన్టీ రామారావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవ వేడుకలలో వీరిద్దరితో కృష్ణ గారి తల్లి నాగరత్నమ్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కొడుకు సాధించిన మరో అరుదైన ఘనతను చూసి ఎంతో ఆనందించారు. ఇక ఈ స్టూడియో ప్రారంభోత్సవ సమయానికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కృష్ణ ఆయన స్ఫూర్తితోనే సినీ రంగ ప్రవేశం చేశారనే విషయం మనకు తెలుస్తుందే.

ఇక పద్మాలయ స్టూడియో ద్వారా ఎంతో మంది సినీ కార్మికులకు ఉపాధి కల్పించడమే కాకుండా.. ఈ బ్యానర్ ద్వారా కృష్ణ నిర్మాతక ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించారు.. సొంతంగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నిర్మించి- దర్శకత్వం వహించారు. అప్పట్లో ఎంతో అంగరంగవైభవంగా జరిగిన పద్మాలయా స్టూడియోస్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.