`ఆర్ఆర్ఆర్‌`ను వెనక్కి నెట్టిన నాగార్జున ఫ్లాప్ మూవీ.. చిత్రం చూడండెహే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెర‌కెక్కించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం ఎంతటి సంచలన‌ విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇటీవల జపాన్‌లోనూ ఈ సినిమాకు అద్భుత రెస్పాన్స్ వచ్చింది. ఇక ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి ఈ సినిమా ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా కొనసాగుతూనే ఉంది.

కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని నాగార్జున నటించిన ఆ ఫ్లాప్‌ చిత్రం వెన‌క్కి నెట్టేసింది. ఆ సినిమా మరేదో కాదు `ది ఘోస్ట్`. ప్రవీఫ్‌ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా నటించారు. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీ ఇది. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాస్ వ‌ద్ద బొక్క బోర్లా ప‌డింది.

దీంతో విడుద‌లై నెలు రోజులు గ‌డ‌వ‌క ముందే ఈ చిత్రం నవంబర్ 2 నుంచి ప్రముఖ దిగ్గ‌జ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేశారు. అయితే ఈ సినిమాకు ఓటీటీ వేదిక‌గా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. స్ట్రీమింగ్ అయిన‌ కొన్ని గంటల్లోనే ఈ సినిమా టాప్ ప్లేస్ లో ట్రెండ్ అయింది. ఇక తాజాగా ఆర్ఆర్ఆర్‌ సినిమాను కూడా వెనక్కి తోసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

the ghost movie beat rrr
the ghost movie beat rrr

ఇటీవల కాలంలో ఎన్ని కొత్త సినిమాలు వచ్చినప్పటికీ ఆర్ఆర్ఆర్‌ చిత్రాన్ని ట్రెండింగ్‌ లిస్టులో నుంచి వెన‌క్కి నెట్టలేకపోయాయి. కానీ ది ఘోస్ట్‌ వంటి ఫ్లాప్ చిత్రం నెట్ ఫ్లిక్స్ టాప్ 10 ట్రేండింగ్ మూవీస్ లిస్ట్ నుండి ఆర్ఆర్ఆర్‌ వెళ్ళిపోయేలా చేసింది. మొత్తానికి థియేటర్స్‌లో ఈ సినిమా అల‌రించలేకపోయిన ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తుండ‌డంతో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

Share post:

Latest