టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్ లో నటించిన సినిమా యశోద. హరిహర శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా నేడు థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది . అంతేకాదు సినిమాలో హీరో లేనప్పటికీ వన్ మ్యాన్ ఆర్మీల సమంత పర్ఫామెన్స్ సూపర్ గా ఉందని.. ఎక్కడా కూడా తన రేంజ్ ని ..తన నటనను తగ్గించుకోలేదని జనాలు చెప్పుకొస్తున్నారు . మరీ ముఖ్యంగా సరో గేట్ మదర్ గా సమంత నటించిన తీరు జనాలను మెప్పించింది .
ప్రతి ఒక్క మహిళ ఈ సినిమాకు కనెక్ట్ అవుతుందని జనాలు చెప్పుకొస్తున్నారు . కాగా సమంత మయోసైటీస్ అనే జబ్బుతో బాధపడుతున్న కానీ ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ముందుకొచ్చింది . లేవలేని పొజిషన్లో కూడా సమంత ఈ సినిమా కోసం పలు ఇంటర్వ్యూలో పాల్గొని తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇస్తూ సినిమాకు వీలైనంత పబ్లిసిటీని తీసుకొచ్చింది . మంచి బజ్ ని క్రియేట్ చేసింది. ఈ క్రమంలోని సమంత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మయోసైటిస్ కారణంగా తాను ఎంత బాధపడ్డానో చెబుతూ ఎమోషనల్ అయింది. అయితే సమంత ది ఒరిజినల్ ఏడుపు కాదని ..దొంగ ఏడుపు అని ఆమెను ట్రోల్ చేస్తున్నారు .
ఎన్నో చిత్రాలలో నటించి తనదైన స్టైల్ లో మెప్పించిన సమంతకి సీన్ క్రియేట్ చేసుకొని ఏడ్చడం పెద్ద కష్టమేమి కాదని ..అందులో ఆమె గొప్ప మహానటి అని ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు సమంత నిజంగా అంత బాధపడి ఉంటే ఈ విషయం ఎప్పుడో చెప్పాలి ..జనాలకి దాచి పెట్టేసి ..కరెక్ట్ గా సినిమా రిలీజ్ అయ్యే ముందు ఇలా ఏడుస్తూ తన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి అడ్డదారులు తొక్కడం కరెక్ట్ కాదని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు సమంత ఏడుపుకి మరో కారణం నాగచైతన్య అంటూ ట్రోల్ చేస్తున్నారు.
సమంత వదిలేసాక నాగచైతన్య ఎటూ కాకుండా పోతాడని సమంతా అనుకునిందని.. కానీ ఆయన సూపర్ గా ఎంజాయ్ చేస్తూ సినిమాలు చేస్తుండేసరికి ఆ బాధను తట్టుకోలేక పోయిందని.. ఈ కారణంగానే సమంత అతనిపై నెగిటివ్ ముద్ర పడేలా మయోసైటిస్ జబ్బును అడ్డుపెట్టుకొని దొంగ ఏడుపులు ఏడ్చిందని కొందరు ఆమెను ట్రోల్ చేస్తున్నారు . దీనిపై సామ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు . ఇలాంటి పొజిషన్లోను సమంతను ట్రోల్ చేస్తున్నారంటే మీరు మనుషులేనా..? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.