తెలుగు సినీ ప్రేక్షకులకు నటి కల్పిక బాగా సుపరిచితమే గత కొద్దిరోజులుగా ఈమె పేరు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఇదంతా ఇలా ఉండగా ఇటీవలే నటి కల్పికా గణేష్ సమంత నటించిన యశోద చిత్రంలో కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా విడుదల అయి మంచి సక్సెస్ సాధించడంతో నటి కల్పికా కు కూడా మంచి గుర్తింపు దక్కింది. కానీ ఇటీవల తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్పిక పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేసింది. ఇప్పటివరకు తాను 30 సినిమాలలో నటించానని తెలియజేసింది.
అందులో 15 సినిమాలు మాత్రమే విడుదలై మంచి సక్సెస్‌ను అందుకున్నాయి.. నటి కల్పికా గణేష్ కొన్ని సినిమాలు చేసిన తర్వాత తనని పూర్తిగా పక్కన పెట్టేసారని చెప్పుకొచ్చింది. సినిమాలలో నటిస్తున్నప్పుడు నేను హీరోయిన్ల కంటే అందంగా కనిపిస్తున్నానని బాగా చేస్తున్నానని చెబుతూ ఉంటారని అయితే హీరోయిన్ లనే డామినేట్ చేసే అందం తనదని కొంతమంది భావిస్తూ ఉంటారని ఆమె తెలియజేస్తోంది. ముఖ్యంగా కథ నచ్చితే తనకు ఎటువంటి సినిమాలలోనైనా నటించడానికి అభ్యంతరం లేదని కూడా తెలియజేస్తుంది కల్పికా.ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ గా మారుతున్నాయి.
ఈమె మాట్లాడిన మాటలపై కొంతమంది నెటిజన్లు సైతం పాజిటివ్‌గా స్పందిస్తూ ఉంటే మరి కొంతమంది మాత్రం నెగిటివ్‌గా స్పందిస్తూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కానీ కొంతమంది హీరోయిన్ల కంటే అందంగా ఉన్నానని చెప్పడం ఓవర్ కాన్ఫిడెంట్ అంటూ ఈమె పైన ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎట్టకేలకు యశోద సినిమాతో తన పేరును మాత్రం బాగా పాపులర్ చేసుకుంది నటి కల్పిక గణేష్. మరి రాబోయే రోజుల్లో ఈమెకు హీరోయిన్గా అవకాశాలు వస్తాయేమో చూడాలి మరి.