ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి తమ పార్టీలో ఉన్న సినీ వ్యక్తులకు కీలకమైన పదవులను ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు మంత్రి పదవిని కూడా ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా మొన్నటి రోజున కమెడియన్ ఆలీ కి కూడా కీలకమైన పదవిని ఇచ్చారు.ఇక నిన్నటి రోజున నటుడు పోసాని కృష్ణమురళిని కూడా పదవులు ఇచ్చి గౌరవించడం జరిగింది. ఇక ఇటీవల 30 ఇయర్స్ పృథ్వి బహిరంగంగానే ప్రభుత్వ మీద పలు కామెంట్లు చేసి పార్టీకి దూరమయ్యాడు.
కానీ జగన్ మాత్రం ప్రస్తుతం ఉన్న ఆలీ,పోసానిలకు పదవులు ఇచ్చి వారిని ఆనందపరిచేలా చేశారు. కమెడియన్ ఆలీకి ఈమధ్య అధికార ప్రభుత్వం సలహాదారుగా పదవిని ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియామకమైన ఆలీ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతూ ఉంటారు. ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం అభినందకం, పరిశ్రమలో పేరొందిన ఆలి ఈ పదవికి సమర్ధుడని జగన్ భావించి ఆలీకి ఈ పదవి ఇవ్వడం జరిగింది.
ఇక ఇప్పుడు నటుడు రచయిత ,పోసాని ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. 2019లో వైసిపి పార్టీ తరఫున పోసాని ప్రచారం చేశారు. ఇక అప్పటినుంచి ఎవరైనా జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే వారిపైన తనదైన స్టైల్ లో విరుచుకుపడుతూ ఉంటారు. దీంతో పోసాని, ఆలీ ఇద్దరు కూడా తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు. సినీ ఇండస్ట్రీలోని నటులు సైతం రాజకీయాల వైపు కూడా బాగా రాణించాలని ఉద్దేశంతోనే జగన్ ఇలా వీళ్ళకి కీలకమైన పదవులు ఇచ్చారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో వైసిపి పార్టీలోకి ఎంతమంది సినీ ప్రముఖులు వస్తారో చూడాలి.