వీర సింహారెడ్డి సినిమా నుండి అదిరిపోయే క్రేజీ అప్డేట్ ఇచ్చిన థమన్..!!

నందమూరి బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో తన కెరియర్ లోనే బిగ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత వరుస క్రేజీ సినిమాలతో టాలీవుడ్ లోనే దూసుకుపోతున్నాడు. ఇక ఇటు సినిమాలతో పాటు ఆహలో అన్ స్టాపబుల్ టాక్ షో తో తన క్రేజ్ ను మరో లెవల్ కు తీసుకెళ్లాడు బాలయ్య. ఇక బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న వీర సింహారెడ్డి షూటింగ్ అనంతపురం పరిసర ప్రాంతాల్లో జరుగుతుండగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ పై ఈ చిత్ర సంగీత దర్శకుడు థ‌మన్ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

”జై బాలయ్య త్వరలో తొడగొట్టి దుమ్ము లేపే టైం వచ్చిందో అంటూ క్రేజీ ఇంట్రెస్టింగ్ ట్విట్ చేశాడు థ‌మన్”. ఇక దీంతో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ జై బాలయ్య అంటూ వచ్చే మొదటి పాటని త్వరలోనే విడుదల చేయనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో గ్రాండ్గా నిర్మిస్తుండగా వచ్చే సంక్రాంతి బరిలో ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Share post:

Latest