అబ్బుర‌ప‌రిచిన `హ‌నుమాన్` అస‌లు బ‌డ్జెట్ ఎంతో తెలిస్తే షాకే!

యంగ్ హీరో తేజ సజ్జా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో `హనుమాన్` అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అమృత అయ్యర్‌ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.

సోమవారం ఈ సినిమా టీజర్ ను బయటకు వ‌ద‌ల‌గా ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. కొండలు, లోయలు, జ‌ల‌ పాతాల‌ నడుమ విజువల్ వండర్ గా సాగిన టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను అబ్బురపరిచింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా టీజర్ తో పోలిస్తే హనుమాన్ టీజర్ ఎంతో అద్భుతంగా ఉందంటూ చాలామంది కొనియాడారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఈ సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా..? రూ. 12 నుంచి 13 కోట్లు మాత్ర‌మే అట‌. నమ్మశక్యంగా లేకపోయినా ఇదే నిజమని అంటున్నారు. సినిమాలో స్టార్ కాస్టింగ్ ఎక్కువ లేకపోవడంతో మేకింగ్ కోసమే ప్రశాంత్ వర్మ అధిక బడ్జెట్ ను కేటాయించారట. ఇక మొత్తానికి తక్కువ బడ్జెట్ తో తెర‌కెక్కించిన‌ప్ప‌టికీ.. టీజర్ పట్టి చూస్తుంటే సినిమా క్వాలిటీ ఎంతో రిచ్ గా ఉండబోతుందని స్పష్టంగా అర్థమైంది. మ‌రి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.