టీడీపీ-జనసేన: ఆ సీట్లలో వైసీపీ లీడ్ తగ్గినట్లేనా..!

చంద్రబాబు-పవన్ కలిశారు..ఇంకా టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అయినట్లేనా? అంటే అందులో డౌట్ ఏముంది..డౌట్ లేకుండా పొత్తు సెట్ అయినట్లే అని చెప్పొచ్చు. పైకి చంద్రబాబు గాని, పవన్ గాని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిసి పోరాటం చేస్తామని, పొత్తుల గురించి ఇప్పుడే చెప్పమని అంటున్నారు గాని..పరోక్షంగా పొత్తు ఫిక్స్ అయిపోయిందని రెండు పార్టీ వర్గాల నుంచి సమాచారం వస్తుంది. ఇక ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు? వీరితో పాటు ఇంకా ఎవరు కలుస్తారు అనేది ఎన్నికల సమయంలో తేలుతుంది.

అయితే టీడీపీ-జనసేన పొత్తు ఉండటం వల్ల..ఎంత కాదు అనుకున్న వైసీపీకి నష్టమే. ఆ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి వైసీపీకి లాభం జరిగేది..కానీ కలిసి పోటీ చేయడం వల్ల వైసీపీకి రిస్క్ తప్పదు. ఇక పొత్తు వల్ల ఏ ఏ సీట్లలో ఆధిక్యం మారుతుంది..ఏ ఏ జిల్లాల్లో టీడీపీ-జనసేన ప్రభావం ఉంటుంది అంటే..మెయిన్‌గా విశాఖ, కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమజిల్లాల్లో పొత్తు ప్రభావం ఎక్కువ.

ఈ ఐదు జిల్లాల్లోనే వైసీపీకి ఎక్కువ నష్టం జరుగుతుంది. ఒకసారి పొత్తు ఎఫెక్ట్ ఉండే సీట్ల గురించి మాట్లాడుకుంటే..శ్రీకాకుళం జిల్లా -టెక్కలి, శ్రీకాకుళం, పలాస.. విజయనగరం-గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురం స్థానాల్లో పొత్తు ప్రభావం ఉంటుంది. విశాఖ-అనకాపల్లి, ఎలమంచిలి, చోడవరం, పెందుర్తి, భీమిలి, గాజువాక, విశాఖ నార్త్, సౌత్ సీట్లు… తూర్పు గోదావరి-కాకినాడ సిటీ, రూరల్, రాజమండ్రి రూరల్, పిఠాపురం, అమలాపురం, కొత్తపేట, రాజోలు, పి.గన్నవరం, మండపేట, జగ్గంపేట, రామచంద్రాపురం సీట్లు.. పశ్చిమ గోదావరి-ఏలూరు, తాడేపల్లిగూడెం, నరసాపురం, తణుకు, భీమవరం, ఉంగుటూరు, నిడదవోలు సీట్లు.

కృష్ణా-విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, పెనమలూరు, అవనిగడ్డ, కైకలూరు, పెడన, మచిలీపట్నం సీట్లలో పొత్తు వల్ల వైసీపీకి రిస్క్. గుంటూరు జిల్లా-ప్రత్తిపాడు, తెనాలి, గుంటూరు వెస్ట్, ఈస్ట్, పొన్నూరు, గురజాల, సత్తెనపల్లి, చిలకలూరిపేట సీట్లలో పొత్తు ప్రభావం ఉండనుంది. ప్రకాశం జిల్లా-ఒంగోలు, దర్శి, గిద్దలూరు.. నెల్లూరు జిల్లా-నెల్లూరు సిటీ..రాయలసీమలో తిరుపతి, చిత్తూరు, కర్నూలు సిటీ, రాజంపేట, అనంతపురం సిటీలో టీడీపీ-జనసేన పొత్తు ప్రభావం ఉంటుంది.