పవన్‌పై తమ్ముళ్ళ డౌట్..జగన్ కోసమే మోదీ!

వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌తో కలిసి పోటీ చేస్తే జగన్‌ని నిలువరించవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ సెపరేట్ గా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి బెనిఫిట్ అయింది..ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని బాబు ప్రయత్నిస్తున్నారు. అటు పవన్ సైతం వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలో విశాఖ ఘటన తర్వాత పవన్‌తో బాబు భేటీ అయ్యారు. దీంతో టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అని, ఈ సారి వైసీపీకి చెక్ పడటం ఖాయమని అంతా అనుకుంటున్నారు.

ఇదే క్రమంలో తాజాగా రాష్ట్రంలో మోడీ పర్యటనతో పరిణామాలు మారిపోయాయి. ఇప్పటికే పవన్‌తో బాబు భేటీ అయ్యారు. పవన్ ఏమో మోదీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత మోదీతో జగన్ భేటీ అయ్యారు. ఈ సీక్వెన్స్ చూస్తుంటే..అంతిమంగా మోదీ..జగన్‌కు లబ్ది చేకూర్చేలా రాజకీయం మారుస్తున్నారని తమ్ముళ్ళు అనుమాన పడుతున్నారు. పవన్‌కు మోదీ రూట్ మ్యాప్ ఇచ్చారని, దాని ప్రకారం జగన్‌ని మళ్ళీ సీఎం చేయడమే లక్ష్యమని అంటున్నారు.

అంటే పవన్-బీజేపీ కలిసి మాత్రమే పోటీ చేసి ఓట్లు చీల్చి టీడీపీకి నష్టం చేకూర్చి, మళ్ళీ జగన్‌ని సీఎం చేయాలని చూస్తున్నారని అనుమానిస్తున్నారు. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియదు గాని, రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మాత్రం కన్ఫ్యూజ్ గా ఉన్నాయి. ఎవరు కలిసి పనిచేస్తున్నారు…ఎవరు విడివిడిగా పనిచేస్తున్నారనేది అర్ధం కాకుండా ఉంది.

కానీ ఏదేమైనా ఈ రాజకీయాల్లో మళ్ళీ బాబు బలి అవుతారనే టెన్షన్ టీడీపీ శ్రేణుల్లో ఉంది. ఎందుకంటే చంద్రబాబు గెలిస్తే, కేంద్రంలో మోదీకి కాస్త ఇబ్బందులు ఎదురవ్వచ్చుని ఆలోచిస్తున్నారని, అందుకే అసలు బాబుని మళ్ళీ గెలవనివ్వకుండా ఉండటమే లక్ష్యంగా ముందుకెళ్తారని, ఆ అంశంలో పవన్‌ని వాడుకుంటునరాని భావిస్తున్నారు. చూడాలి మరి చివరికి రాజకీయం ఎలా ఉంటుందో.