సీనియర్ హీరోయిన్‌ స్నేహ భర్త నుండి విడాకులు తీసుకుందా..? సోషల్ మీడియా పోస్ట్ వైరల్..!!

సౌత్ ఇండియన్ సీనియర్ హీరోయిన్‌ స్నేహ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌందర్య తర్వాత ఆ స్థాయిలో స్నేహ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. హోమ్లీ క్యారెక్టర్లతో ఫ్యామిలీ ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న స్నేహ.. 2011లో తమిళ్ నటుడైన ప్రసన్న కుమార్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు సినిమాల‌కు దూరమైన స్నేహ.. తర్వాత వినయ్ విధేయ రామ సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చింది.

ఈ సీనియర్ ముద్దుగుమ్మ‌ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా పిచ్చా యాక్టివ్‌గా ఉంటుంది. తనకి తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా స్నేహ తన భర్త నుంచి విడాకులు తీసుకుందని రకరకాల రూమర్స్‌ చక్కర్లు కొడుతున్న విషయం మనకు తెలిసిందే.

స్నేహ గత కొంతకాలంగా ఆమె భర్త ప్రసన్న కుమార్‌కు దూరంగా ఉంటుందని వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి… ఇద్దరు అందుకే విడిపోయారు అన్నట్టు వార్తలు కూడా వచ్చాయి. తాజాగా స్నేహ ఈ రోమర్స్ అన్నిటికి చెక్‌ పట్టింది. తన భర్తతో తన పిల్లలతో కలిసి దిగిన ఓ ఇంట్రెస్టింగ్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోకు ట్విన్నింగ్‌ అంటూ కామెంట్ కూడా ఇచ్చింది. స్నేహ చేసిన ఈ పోస్టుతో ప్రస్తుతం వచ్చిన రూమర్స్ అన్నిటికీ చెక్ పెట్టినట్లయ్యింది.

Share post:

Latest