15 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఫ్లైట్ నుండి దూకేసిన శర్వానంద్.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాకే!

నందమూరి నటసింహం బాలకృష్ణ `అన్ స్టాపబుల్` అనే టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మొదటి సీజన్ మంచి సక్సెస్ అందుకోవడంతో ఇటీవల గ్రాండ్ గా రెండో సీజన్ ప్రారంభమైనది. అయితే ఈ షో మూడో ఎపిసోడ్ లో యంగ్ హీరోలు శర్వానంద్ మరియు అడివి శేషులు వచ్చి బాలయ్యతో కలిసి సందడి చేశారు.

ఈ సందర్భంగా శర్వానంద్ `జాను` సినిమా షూటింగ్ సమయంలో తనకు జరిగిన ప్రమాదాన్ని గుర్తుచేసుకొని చాలా ఎమోషనల్ అయ్యాడు. `జాను` సినిమాలో “లైఫ్ ఆఫ్ రామ్“ సాంగ్ ఎంత పాపులర్ అయిందో మనకి తెలుసు. అయితే ఆ సినిమా సాంగ్ షూటింగ్ టైంలో ఫ్లైట్ నుంచి కిందకు దూకి స్కై డ్రైవింగ్ చేయాలి. అయితే దానికోసం శర్వానంద్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడట. షూటింగ్ రోజు 15000 అడుగుల ఎత్తులో ఉన్న ఫ్లైట్ నుంచి దూకగా మధ్యలో పారాషూట్ పనిచేయకపోవడంతో కిందపడ్డాడట.

అలా పడిపోవడంతో తీవ్ర గాయాల పాలైన ఆయనకు ఆపరేషన్ అయ్యి రైట్ సైడ్ చేతికి రెండు ప్లేట్స్, 24 కుట్లు కూడా పడ్డాయట. అంతేకాకుండా రైట్ సైడ్ కాలికి ఒక ప్లేట్ పడిందని కూడా శర్వానంద్ చెప్పారు. ఈ ప్రమాదం నుండి కోలుకోవడానికి శర్వానంద్ కి దాదాపు రెండున్నర సంవత్సరాలు పట్టిందని అందరి ప్రార్థనవల్ల, ఆ దేవుడి దయ వల్ల ఆయన కోలుకున్నానని పేర్కొన్నాడు. తన ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఫ్రెండ్స్ హాస్పటల్లో తనని చాలా జాగ్రత్తగా దగ్గరుండి కంటికి రెప్పలా చూసుకున్నారని.. కాబట్టే ప్రస్తుతం ఈ పొజిషన్లో ఉన్నాడని ఆయన చెప్పుకొచ్చారు.

 

ఇక ఈ సంఘటనను తను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని అంటూ శర్వానంద్ చాలా ఎమోషనల్ అయ్యాడు. దీంతో బాలకృష్ణ సైతం గతంలో తనకు కూడా ఇలాంటి ప్రమాదమే జరిగిందని చెప్పుకొచ్చాడు. `పవిత్ర ప్రేమ` సినిమా క్లైమాక్స్ షూటింగ్ టైంలో బాంబ్ బ్లాస్ట్ ఉంటే దానివల్ల తన‌కు కూడా చాలా పెద్ద ప్రమాదం అయిందని దాని నుండి కోలుకోవడానికి కొంతకాలం పట్టిందని ఆయన తెలిపారు.