ఏజ్ లో మాత్రమే సీనియర్.. రెమ్యూనరేషన్ కాదంటున్న హీరోయిన్..!!

తెలుగు ఇండస్ట్రీలో హీరోల రెమ్యూనరేషన్ తో పోలిస్తే.. హీరోయిన్ల పారితోషకం చాలా తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. హీరోలు కూడా ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు చేస్తే హీరోయిన్లు మాత్రం నాలుగైదు సినిమాలలో నటిస్తూ ఉంటారు. అందుకు తోడు పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, పలు కమర్షియల్ యాడ్స్ ద్వారా ఇతర వాటి ద్వారా భారీగానే సంపాదిస్తూ ఉంటారు. హీరోయిన్లకు ఒక్క సూపర్ హిట్టు పడితే చాలు రెమ్యూనరేషన్ అమాంతం పెంచేస్తూ ఉంటారు. ఇలాంటి లిస్టులో హీరోయిన్ త్రిష తాజాగా చేరిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.

Prestigious career to a lavish lifestyle and whopping net worth: Dive into  Trisha Krishnan's personal life | PINKVILLA

ప్రస్తుతం ఈమె ఏజ్ 39 సంవత్సరాలు అయినప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీగా రెమ్యూనరేషన్ ని డబుల్ చేయడం ప్రతి ఒక్కరిని ఆసక్తి కలిగించేలా చేస్తోంది. ఇండస్ట్రీకి ఇప్పుడు పరిచయం అవుతున్న యువ హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలు చేసి కనుమరుగవుతున్న సమయంలో త్రిష ఇండస్ట్రీలోకి వచ్చి 23 సంవత్సరాలు కావస్తోంది. ఒకానొక సమయంలో టాప్ హీరోయిన్గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ కొత్త హీరోయిన్ లాగ పెరుగుతున్న కూడా తన హవా కొనసాగిస్తూనే ఉన్నది. ఇక పలు లేడి ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించింది ఈ అమ్మడు.

Kundavai (@trishtrashers) / Twitter

అయితే 2018 లో త్రిషకు అంతగా కలిసి రాలేదని చెప్పవచ్చు. అలాంటి సమయంలో మణిరత్నం డ్రిమ్ ప్రాజెక్ట్ త్రిషకు అవకాశం గా మారిందని చెప్పవచ్చు ps -1 సినిమాతో యువరాణి కుందవై పాత్రలో త్రిష అద్భుతంగా నటించింది. దీంతో తమిళంలో సూపర్ హిట్ కావడంతో ఈమె కు మంచి డిమాండ్ ఏర్పడింది. గడిచిన సంవత్సరం క్రితం ఈ ముద్దుగుమ్మ రూ.2 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకోగా.. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ.4 కోట్ల రూపాయలు అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హీరో విజయ్ దళపతి అజిత్ చిత్రాలలో నటిస్తూ ఉన్నది త్రిష.

Share post:

Latest