సీనియ‌ర్ హీరోయిన్ రాధిక‌కు చిరంజీవిలో న‌చ్చ‌నిది… బాల‌య్య‌లో న‌చ్చేది ఇవే…!

నందమూరి నటసింహ బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహ‌లో అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే టాక్ షో ప్ర‌సారం అవుతోంది. తాజాగా రెండో సీజ‌న్ ర‌న్ అవుతోంది. ఇప్ప‌టికే మూడు ఎపిసోడ్లు కూడా స్ట్రీమింగ్ అయ్యాయి. రెండో సీజ‌న్లో ఎపిసోడ్ల‌కు యంగ్ హీరోలు రావ‌డంతో అదిరిపోయే రెస్పాన్స్‌లు వ‌స్తున్నాయి. నాలుగో ఎపిసోడ్లో బాల‌య్య త‌న మాజీ స్నేహితుడు, ఏపీ మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణ ఎంపీ సురేష్ రెడ్డి గెస్టులుగా వ‌చ్చారు.

Pic Talk: Balayya's Unstoppable With Ex-CM

ఇదే ఎపిసోడ్‌కు అల‌నాటి మేటి న‌టి రాధిక కూడా వ‌చ్చారు. ఈ షోలో బాల‌య్య చాలా ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు రాబ‌ట్టారు. రాధిక‌ను ఆమె న‌టించిన హీరోలపై తన అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య.. చిరంజీవిలో నచ్చనిది ఏంటి ? నాలో నచ్చేది ఏంటి ? అన్న ప్ర‌శ్న వేసి ఆమెను తిక‌మక పెట్టాడు. అయితే ఈ ప్ర‌శ్న‌ల‌కు రాధిక కూడా త‌న‌దైన స్టైల్లో ఆన్స‌ర్ చేసింది.

నేను నీతో ఎప్పుడూ గొడ‌వ ప‌డ‌ను.. చిరంజీవితో మాత్రం ఎప్పుడూ గొడ‌వ ప‌డుతూనే ఉంటాను.. నేను ఎక్కువుగా మాట్లాడుతూ ఉంటాన‌ని.. చిరంజీవి న‌న్ను తిడుతూ ఉంటాడు.. కాని నేను తిరిగి తిడుతూ ఉంటాన‌ని చెప్పింది. మేం ఎప్పుడూ గొడ‌వ ప‌డుతూ… ఇద్దరం ఎప్పుడు కొట్టుకుంటేనే ఉంటాం. మా ఇద్దరి మధ్య సురేఖ అంపైర్ లా ఉంటుంద‌ని… చిరుతో సరదా ఉండదు అసలు అని రాధిక చెప్పింది. ఇక ఈ సీజన్లో త‌ర్వాత ఎపిసోడ్ల‌కు జ‌య‌సుధ కూడా వ‌స్తున్న‌ట్టుగా తెలుస్తోంది.

Share post:

Latest