దర్శకుడు త్రివిక్రమ్ ఆ సీనియర్ హీరోయిన్ తో అంత పని చేయించాడా.. హవ్వ.. హవ్వ..!!

ధర్మచక్రం వంటి అద్భుతమైన హిట్ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సీనియర్ హీరోయిన్ ప్రేమ. భక్తి సినిమాలతో ఎంతో పేరు పొందిన ప్రేమ.. గ్లామర్ పాత్రలో కూడా నటించింది. ఈ క్రమంలోనే ఉపేంద్ర హీరోగా వచ్చిన ‘రా’ సినిమాలో ప్రేమ హీరోయిన్గా నటించింది. ఇక ఆ సినిమాలో ఈమె బోల్డ్ సీన్స్ లో నటించి అందరికీ షాక్ ఇచ్చింది.. ఒక ఆ సినిమాలో వచ్చే ఆ సీన్స్ ని ఇప్పటికీ మనం మర్చిపోలేని విధంగా ఈమె తన నటనతో ఆకట్టుకుంది.

 Actress Prema Interesting Comments On Her Life In Ali Show Nov 15 , Actress Prem-TeluguStop.com

ఇలా వ‌రుస‌ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న ప్రేమ కెరియర్‌ని తిప్పేసిన చిత్రం చిరునవ్వుతో .. ఈ సినిమాకు కథ అందించిన త్రివిక్రమ్ ఈ సినిమాకు తానే దగ్గరుండి అన్ని చూసుకున్నారట. ఈ సినిమా తొట్టెంపూడి వేణు కెరీయర్‌ని మలుపు తిప్పనన సినిమా.. ఈ చిత్రంలోనే ప్రేమ ఒక ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాలో ప్రేమ హీరో మరదల పాత్రలో నటించింది. ప్రేమ పాత్ర ఈ సినిమాలో కొంచెం నెగిటివ్ పాత్రకు దగ్గరగా ఉంటుంది.. వంటవాడైన హీరోని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక వేరే అతనితో లేచిపోయి మోసపోతుంది.

మొదట ఆ క్యారెక్టర్ లో తను చేయడానికి ముఖ్య కారణం అది కూడా హీరోయిన్ క్యారెక్టర్ అని చెప్పి ఒప్పించారట.. తనకి ఇష్టం లేకపోయినా రైటర్ త్రివిక్రమ్ మీద నమ్మకంతో ఆ సినిమాలో నటించాలని ప్రేమ చెప్పింది. అయితే సినిమా రిలీజ్ అయ్యాక తన క్యారెక్టర్ కాస్త సెకండ్ హీరోయిన్ పాత్ర అయిపోయిందని.. షూటింగ్ కి వచ్చే ముందు ఒక మాట చెప్పి.. తర్వాత వేరే విధంగా చిత్రీకరించి నన్ను మోసం చేశారని ప్రేమ ఆరోపించింది..చిరునవ్వుతో సినిమా తర్వాత ఈ సీనియర్ హీరోయిన్ కి అన్ని సెకండ్ హీరోయిన్ పాత్ర‌లే వచ్చాయని హీరోయిన్గా తన కెరియర్ ఈ సినిమాతో క్లోజ్ అయిపోయిందని వాపోయింది ప్రేమ. ఈ క్రమంలోనే చిరునవ్వుతో సినిమాలో తన పాత్ర బాగుంటుందని సినిమాలో పాటలు ఇప్పటికీ కూడా అందరికీ నచ్చుతాయని.. నా పాత్రకు నేను న్యాయం చేశానని చెప్పుకొచ్చింది ఒకప్పటి అందాల తార ప్రేమ.

Share post:

Latest