ఇపుడు విజయ్ దేవరకొండ హీరోయిన్ అనగానే ముందుగా ఇపుడు అందరికీ లైగర్ హీరోయిన్ అనన్య పాండే గుర్తుకు వస్తుంది. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ అదుర్స్. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ కూడా హల్ చల్ చేయడం చూసాం. కాగా అనన్య పాండేకి, సారాకి వున్న స్నేహం గురించి తెలిసినదే. తరచుగా వీరు వార్తల్లో నిలుస్తూ వుంటారు. ముఖ్యంగా వారు ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తారు, కలిసే వుంటారు. అందుకే రూమర్స్ ఎప్పుడు వారిద్దరి చుట్టూ తిరుగుతూ ఉంటాయి.
తాజాగా సారా అలీఖాన్ కన్ను టాలీవుడ్ హ్యాండ్ సమ్ విజయ్ దేవరకొండ పై పడింది. ఆమధ్య కరణ్ జోహార్ షోలో హీరో విజయ్ పట్ల క్రష్ వున్న విషయం చెప్పి టాక్ అఫ్ ది టౌన్ అయింది. ఇక విజయాలతో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండకు బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన్ని ఇష్టపడే యంగ్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. కాగా ఈ లిస్ట్ లో సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ ముందు వరుసలో ఉంటారు. అవకాశం వస్తే అతనితో నటించడానికి, డేటింగ్ చేయడానికి సిద్ధం అంటూ వారు ఓపెన్ ఆఫర్ ఇచ్చిన సంగతి విదితమే.
ఇక అసలు విషయానికొస్తే, తాజాగా సారా అలీ ఖాన్ బికినీలో బెంచ్ పై కూర్చొని ఉన్న ఫోటో షేర్ చేశారు. సదరు ఫోటో చూసిన సోషల్ మీడియా జనాలు సారా తోడు లేక విరహవేదనతో ఉన్నట్టు కనబడుతోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక కొంతమంది అయితే ఆ వేదన విజయ్ దేవరకొండ కోసమేనా అని అడుగుతున్నారు. 26 ఏళ్ల సారా అలీ ఖాన్ 2018లో విడుదలైన కేధార్ నాథ్ సినిమాతో బాలీవుడ్ తెరకు పరిచయం అయింది. ఇన్నేళ్ళలో సినిమా కంటే ఎఫైర్ రూమర్స్ తో సారా వార్తల్లో నిలవడం కొసమెరుపు.