ఆ దెబ్బకు నా దవడ పగిలిపోయింది.. ఇంట్రెస్టింగ్ మ్యాటర్ బయటపెట్టిన సమంత..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్ లో చేస్తున్న సినిమా “యశోద”. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నవంబర్ 11న గ్రాండ్గా థియేటర్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ కి అటెండ్ అయిన సమంత ఓ ప్రముఖ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన యశోద సినిమా షూటింగ్ ఎక్స్పీరియన్స్ ను బయటపెట్టింది .

అంతేకాదు స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే జబ్బుతో బాధపడుతున్న సంగతి తెలిసిందే . ఫస్ట్ టైం ఈ జబ్బు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. ” నేను ఇంకా చావలేదు బ్రతికే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగా ఉందని కానీ ఎప్పుడు ఎలా మారిపోతుందో నాకే తెలియడం లేదని ..ఎలాగైనా సరే వయోసైటిస్ జబ్బును అధికమించి మళ్ళీ మీ ముందుకు వస్తానని “చెప్పుకొచ్చింది. కాగా ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు డాన్స్ , రొమాంటిక్ సీన్స్ కన్నా కానీ యాక్షన్ సీన్స్ చేయడమే ఇష్టమని మొదటి నుంచి యాక్షన్ సీన్స్ అంటే నాకు చాలా చాలా పిచ్చి అని చెప్పుకొచ్చింది.

అంతేకాదు ఈ సినిమా కోసం రియల్ స్టండ్స్ చేశానని డూప్ లేకుండా నా యాక్షన్ సీన్స్ లో నేనే నటించాలని చెప్పుకొచ్చింది . మరీ ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ 20 నిమిషాల సీన్స్ లో నా పెర్ఫార్మెన్స్ జనాలకు కొత్తగా అనిపిస్తుందని ..అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తుందని చెప్పుకొచ్చింది . అంతేకాదు లాస్ట్ 20 మినిట్స్ క్లైమాక్స్ సీన్స్ లో నా ఫేస్ మొత్తం మారిపోయిందని ..లాస్ట్ పంచ్ కి నా దవడ పగిలిపోయిందని అరగంటసేపు స్పాట్ లోనే అల్లాడిపోయానని..అయినా కానీ యాక్షన్ సీన్స్ అంటే ఇష్టం ఉన్న కారణంగా ఆ నొప్పి నాకు పెద్దగా తెలియలేదని చెప్పుకొచ్చింది .అంతేకాదు వన్ వీక్ ఆ దెబ్బకి ముఖం వాచిపోయిందని అయినా కానీ అలాగే నాచురల్ గా ఉంటుందని సినిమా షూట్ కంటిన్యూ చేసామని చెప్పుకొచ్చింది . దీంతో యశోద సినిమా కోసం సమంత ఇంత కష్టపడినా అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమా ఎలాగైనా హ్యూచ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు . కాగా సరోగసి అనే కథ బ్యాక్ గ్రౌండ్ లో జరిగే క్రైమ్ అలాంటిదో తెలిపే ఈ చిత్రం కొత్తగా ఉంటుందని చిత్ర బృందం చెప్పుకొస్తున్నారు .

Share post:

Latest