తెలిసి తెలిసి అదే తప్పు చేస్తున్న సాయి పల్లవి… ఈ పిల్ల ఇక మారదా..?

మలయాళం ప్రేమమ్‌ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది సాయి పల్లవి. ఆ సినిమాలో తన నటనతో అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత వరుస పెట్టి తెలుగు, తమిళ్, మలయాళ భాషలలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో సాయి పల్లవి ఫిదా సినిమాతో తన నటన, డైలాగులతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

Sai Pallavi: Do you know these interesting things about Sai Pallavi who captivates the audience with her acting .. | These are the unkown facts about actress sai pallavi birthday special – filmyzoo – Hindisip

ఆ సినిమా తర్వాత నుంచి తెలుగులో వరుస సినిమాలు చేసుకుంటూ తన రేంజ్ పెంచుకుంది.
సాయి పల్లవి తాను నటించిన సినిమాలలో గ్లామర్ షోకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర‌లను ఎంచుకుంటూ తన ఇమేజ్‌ను పెంచుకుంటుంది. అయితే ఈ ముద్దుగుమ్మ గ‌త‌ కొంతకాలంగా నటిస్తున్న సినిమాల గురించి ఎలాంటి అప్డేట్ లేదు. చివరగా గార్గి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది సాయి పల్లవి.

Actress-Sai-Pallavi-in-saree - বর্তমান সময়

లేడీ ఓరియెంటెడ్ సినిమాగా వచ్చి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా సాయి పల్లవికి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. అయితే సాయి పల్లవి సినిమాలలోకిి రాకముందు మెడిసిన్ చదివిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సాయి పల్లవి చెన్నై దగ్గరలో ఉన్న కోయంబత్తూర్ లో ఓ హాస్పిటల్ నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాలకు గుడ్ బై చెప్పి డాక్టర్‌గా స్థిరపడాలని ప్రయత్నిస్తుందట. ఈ హాస్పటల్‌ను సాయి పల్లవి తో పాటు తన చెల్లి పూజ తో కలిసి నిర్వహించనున్నారట.

Sai Pallavi is doctor now | nowrunning

అందుకే ఈ మలయాళీ బ్యూటీ చిత్ర పరిశ్రమకు దూరమవుతుందని ఓ టాక్ నడుస్తుంది. ఆమె కెరియర్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న సమయంలో ఇలాంటి తప్పుడు నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది..ఇక ఈమె మారదా అంటూ సాయి పల్లవి పై విమర్శలు గుప్పిస్తున్నారు.

Share post:

Latest