పోసాని కృష్ణ మురళి పై కేసు నమోదు.. కారణం ఏమిటంటే..?

సినీ నటుడు పోసాని కృష్ణ మురళి టాలీవుడ్లో విభిన్నమైన కమెడియన్ గా పేరు పొందారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అటు రాజకీయాలలో సినిమాలలో బిజీగా ఉన్నారని చెప్పవచ్చు. గడచిన కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన సంగతి అందరికీ తెలిసిందే.. అయితే తాజాగా రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్ లో పోసాని పైన కేసు నమోదు అయింది.వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Posani Krishna Murali: పోసానిపై కేసు | Case against Posani bbr

పోసాని కృష్ణ మురళి పై..355,500,504,507,509 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన పలు గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతంలో జనసేన పార్టీ మహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్ అధ్వారణంలో మందం ఇందిరా రాజమండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆ సమయంలో పోలీసులు ఈ విషయాన్ని అసలు పట్టించుకోకపోవడం వలన ఆ కేసు నమోదు చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. దీంతో గత కొంత కాలంగా స్థానిక రెండో జేఎఫ్ సీఎం కోర్టులో ఇందిరా అనే మహిళ తరుపున వాదనలు వినిపించారు న్యాయవాదులు.

Pawan Kalyan Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ విషయంలో పోసాని కృష్ణ  మురళి పై కేసు నమోదు..

ఆ వాదనలు విన్న తర్వాత కోర్టు పోసానిపైన కేసులు నమోదు చేయాలంటూ ఆదేశాలను జారీ చేసింది. ఆదేశాలతో పోసాని కృష్ణ మురళి పై పలు సెక్షన్స్ కింద కేసులో నమోదు చేయడం జరిగిందట. దీంతో పలువురు పోసాని అభిమానుల సైతం ఇది కావాలనే ప్లాన్ ప్రకారమే చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పోసాని పలు సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్లలో మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం పోసాని గురించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.

Share post:

Latest