ఏపీ అధికార పార్టీ వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో సీఎం జగన్ను పక్కన పెడితే.. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఎవరు పనిచేస్తున్నారు? చేయడం లేదు? అనేది ఎప్పటికప్పుడు.. సీఎం జగన్ తెలుసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా.. 70 మంది అని.. తర్వాత 50 మంది అని ఇలా కొన్ని లెక్కులు వెలుగులోకి వచ్చాయి.అయితే.. తాజాగా ఈ సంఖ్య 30కి చేరిందని తాడేపల్లి వర్గాలు అంటున్నాయి.
అంతేకాదు.. ఈ 30 మందికి ఎన్నిసార్లు చెప్పినా.. మారడం లేదేని కూడా వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. వీరిలో ఉత్తరాంధ్రకు చెందిన వారు, సీమకు చెందినవారు.. మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారని తాడేపల్లి వర్గాలు అంటున్నాయి. వారు పనిచేయరు.. వేరే వారు చేస్తుంటే.. అడ్డు తగులుతున్నారు. పైగా.. అధిష్టానం ఆదేశాలను కూడా పక్కన పెట్టి సొంత పనులు చేసుకుంటున్నారు.
వీరిని మార్చడం ఖాయమని తాడేపల్లి వర్గాలు చెబుతుండడం గమనార్హం. అయితే.. ఎవరెవరు.. ఎక్కడివారు.. అనేది మాత్రం ఎవరూ చెప్పడం లేదు.కానీ, మార్పు అయితే.. ఖాయమ ని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా.. ఈ వరుసలో మాజీ మంత్రులు నలుగురు వున్నారని తెలుస్తోంది. అదే విధంగా ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారిలో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి.
మార్పు తప్పదని అంటున్నా రు. ఇక, మిగిలిన 24 స్థానాల్లో.. మాత్రం.. కొందరు జంపింగులకు టికెట్లు ఇస్తారని తెలుస్తోంది. అదేవిధంగా ఇద్దరు సినీ రంగ దిగ్గజాలకు కూడా టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయని తాడేపల్లి వర్గాలు చెబుతుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.