పాపం ర‌ష్మిక‌.. స్టార్ హీరోయిన్ అయినా ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చిందేంటి?

రష్మిక మందన.. ఈ అమ్మడుకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. సౌత్ లోనే కాదు నార్త్ లోను ఏ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా గ‌డుపుతోంది. అయితే తాజాగా రష్మికకు ఊహించని పరిస్థితి ఎదురయింది. అదేంటంటే ఈమె నటించిన ఓ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలవుతోందట‌. వాస్త‌వానికి ఇటీవల డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ లు బాగా తగ్గిపోయాయి. చిన్న సినిమాల‌ను సైతం థియేటర్లోనే విడుదల చేస్తున్నారు.

 

ఇలాంటి తరుణంలో మంచి అంచనాలు ఉన్న చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు `మిషన్ మజ్ను` బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రానికి శంతను బాగ్చి దర్శకత్వం వహించాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న‌ ఈ చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది.

అయితే తాజా బ‌జ్ ప్రకారం ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నార.ట ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ రైట్స్ ను భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిందట. వచ్చే ఏడాది సంక్రాంతి క‌నుక‌గా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. నార్త్ లో రెగ్యులర్ కంటెంట్ పట్ల ఏర్పడుతున్న వ్యతిరేకతే కారణంగా `మిషన్ మజ్ను`ను డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నార‌ట‌. ఏదేమైనా రష్మిక లాంటి స్టార్ హీరోయిన్ మూవీకి ఇలాంటి పరిస్థితి రావ‌డంతో అభిమానులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు.