టాలీవుడ్ లో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ మధ్య వరుస వివాదాలలో చిక్కుకుంటూ ఉంటున్నారు. తాజాగా విజయ్ తో తెరకెక్కించిన లైగర్ సినిమాని పాన్ ఇండియా లేవలో తెరకెక్కించి డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా నెలరోజుల పాటు బ్రేక్ తీసుకొని మైండ్ ను రిఫ్రెష్ చేసుకున్నామనుకున్న పూరి చిరంజీవితో ఇన్స్టాగ్రామ్ లో చిట్ చాట్ లైవ్ ను కూడా ముచ్చటించారు. మూడేళ్లు పడ్డ లైగర్ సినిమా కష్టం వృధా అయిపోయిందని తెలియజేసినట్లుగా సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా ఎఫెక్ట్ నుంచి కోలుకోలేకపోతున్నానని తెలియజేసినట్లు ఆమధ్య వార్తలు వినిపించాయి.
ఇక ఈ మధ్యన డిస్ట్రిబ్యూటర్లు కూడా పూరి జగన్నాథ్ కు వార్నింగ్ ఇస్తూ ఒక లెటర్ ని కూడా రాయడం జరిగింది. ఆ తరువాత పూరి జగన్నాథ్ అగ్రేసివుగా వారికి వాయిస్ మెసేజ్ పంపడం జరిగింది. పూరి తనకు వచ్చిన అమౌంట్ లో కొంత అడ్జస్ట్ చేస్తానని చెప్పిన బయ్యర్లు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం వంటివి జరగడం జరిగింది.ఆ తర్వాత సైలెంట్ అయింది అనుకుంటే ఇప్పుడు తాజాగా ఈడి అధికారులు పూరి జగన్నాథ్ ,ఛార్మిలను పిలిపించి విచారించడంతో ఇప్పుడు మరొకసారి ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతుంది.
లైగర్ సినిమా నిర్మాణ విషయంలో కొంతమంది రాజకీయ నేతలు పెట్టుబడి పెట్టినట్లుగా వార్తలు వినిపించాయి. అందుచేతనే లైగర్ సినిమా దర్శకుడు పూరి నిర్మాత ,చార్మికి ఈడి అధికారుల 15 రోజుల క్రితం నోటీసులు పంపించినట్లుగా సమాచారం. ఈ విషయం చాలా సీక్రెట్ గా ఉంచిన పూరి ,ఛార్మి కలిసి ప్రైవేట్ గా ఈడి ఆఫీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. పెట్టుబడిలపై వీరిని ఈడి అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది మరీ క్రమంలో ఈ వివాదం లో ఎవరెవరు పేర్లు బయటపడ్డాయి ఇంకా బయటికి రాలేదు. రాబోయే రోజుల్లో క్లారిటీ వస్తుందేమో చూడాలి.