సౌంద‌ర్యతో అలాంటి సీన్ చేసి ఏడ్చేసిన‌ ర‌మ్మ‌కృష్ణ.. క‌ట్ చేస్తే ప్ర‌శంస‌లు!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్లలో `నరసింహ` సినిమా ఒకటి. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అంతేకాకుండా రమ్యకృష్ణ సినీ కెరీర్‌లో ఎన్నో పాత్రలు ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాలోని నీలాంబరి పాత్ర ప్రత్యేకమైనది అని చెప్పాలి. రమ్యకృష్ణ ఒక సందర్భంలో ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

అయితే `నరసింహ` సినిమాలోని నీలాంబరి పాత్ర చేయడం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పుకొచ్చింది. అయితే డైరెక్టర్ పాత్రను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చి ఉంటే సౌందర్య రోల్ లో తాను సెలెక్ట్ చేసుకునేదానినని.. తలపొగరు ఎక్కువగా ఉన్న నీలాంబరి క్యారెక్టర్ ని రిసార్ట్ చేసేదాన్ని ఆమె చెప్పుకొచ్చింది. కానీ ఆ అవకాశం డైరెక్టర్ ఇవ్వలేదని తనకు నీలాంబరి క్యారెక్టర్ మాత్రమే ఇచ్చారని ఆమె కామెంట్లు చేశారు.

అంతేకాకుండా ఈ సినిమాలో సౌందర్య ముఖంపై కాలు పెట్టే సీన్ చేయలేనని ఆమె చెప్పింది. పైగా సౌందర్య స్టార్ హీరోయిన్ అని తనకు మార్కెట్ తక్కువని రమ్యకృష్ణ పేర్కొంది. అంతేకాకుండా సౌందర్య చెయ్యాలి చెయ్యాలి అని చెప్పి ఆమెనే తన కాలిని ముఖంపై పెట్టుకున్నారని.. ఇక ఆ సమయంలో రమ్యకృష్ణ ఎంతగానో కుమిలి కుమిలి ఏడ్చార‌ని ఆమె చెప్పుకొచ్చింది.అయితే ర‌మ్య‌కృష్ణ ఇష్టం లేక‌పోయినా ఈ సినిమా చేసింది.

క‌ట్ చేస్తే ఆమె న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అలాగే ఆమె కెరీర్‌లో నీలాంబ‌రి పాత్ర ఎప్ప‌టికీ గుర్తిండిపోయే పాత్ర‌గా నిలిచింది. అంతేకాకుండా రమ్యకృష్ణకు సోషల్ మీడియాలో కూడా భారీ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం గమనార్హం.

 

Share post:

Latest