జగన్ స్ట్రాటజీకి రాబిన్ కౌంటర్ స్ట్రాటజీ..!

నలభై ఏళ్ల అనుభవం..మూడుసార్లు సీఎం, రెండుసార్లు ప్రతిపక్ష నేత తాను చూడని రాజకీయం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడు చెబుతూ ఉంటారు..అలాగే రాజకీయ చాణక్యుడుగా పేరుంది. అలాంటి చాణక్యుడుకు జగన్ పెద్ద కొట్టిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో చావుదెబ్బ కొట్టారు. ఆ దెబ్బతో టీడీపీ భవిష్యత్ ప్రమాదంలో పడింది. ఇక బాబు వ్యూహాలు పాతవి అయిపోయాయని అందరికీ అర్ధమైంది. ఆయన వ్యూహాలు 90ల కాలంలో వర్కౌట్ అయ్యాయి గాని, ఇప్పుడు వర్కౌట్ అవ్వవని తేలిపోయింది.

ఆ విషయం చంద్రబాబుకు కూడా అర్ధమైంది..అందుకే జగన్..ప్రశాంత్ కిషోర్‌ని ఎన్నికల వ్యూహకర్తగా పెట్టుకుని ఎలా సక్సెస్ అయ్యారో..అదే తరహాలో బాబు కూడా రాబిన్ శర్మని వ్యూహకర్తగా పెట్టుకున్నారు. ఈ రాబిన్ కూడా గతంలో పీకేతో పాటు పనిచేసిన వ్యక్తే. అయితే రాబిన్ శర్మ వ్యూహాలతో బాబు ముందుకెళుతున్నారనే విషయం తెలిసిందే..కానీ ఎప్పుడు తెర వెనుక ఉండే రాబిన్..తాజాగా తెరముందుకు వచ్చారు.  తాజాగా టీడీపీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఇదేం ఖర్మ కార్యక్రమం గురించి ఆంగ్లంలో వివరించారు.

అయితే టీడీపీ చరిత్రలో ఓ వ్యూహకర్తని పెట్టుకోవడం ఇదే మొదటిసారి.  అయితే రాబిన్ వ్యూహాలు టీడీపీకి ఎంతవరకు మేలు చేస్తాయనేది పెద్ద చర్చగా మారింది. ఇంతకాలం అంటే రాబిన్ బయటకు కనిపించలేదు. కానీ ఇప్పుడు బయటకు తీసుకురావడం ద్వారా..చంద్రబాబు పరోక్షంగా వైసీపీకి తమ దగ్గర కూడా వ్యూహకర్త ఉన్నారు..జాగ్రత్తగా ఉండాలని సంకేతాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇప్పటికే పీకే టీం వైసీపీ కోసం పనిచేస్తుంది..దానికి పోటీగా రాబిన్ శర్మ టీడీపీ కోసం పనిచేస్తున్నారు. అలాగే తాజాగా ప్రజలంతా ఆనందంగా ఉన్నారన్న తప్పుడు భావనను వ్యాపింపచేయడానికి అధికార పార్టీ ఒక ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తోందని, ప్రజలు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు? వారి జీవనం ఎంత దుర్భరంగా మారిందన్నది ప్రధాన ప్రతిపక్షంగా మనం చూపించాలని, ఈ విషయాలన్నీ ప్రజల్లోకి వెళ్లి చెప్పాలని నేతలకు రాబిన్ సూచించారు. ఈ మధ్య 98 శాతం హామీలు అమలు చేశాం..90 శాతం పథకాలు వెళ్ళాయి..మనం ప్రజలకు మంచి చేస్తున్నాం..అందుకే 175 సీట్లు గెలుస్తామని జగన్ పదే పదే చెబుతున్నారు. ఇక దానికి కౌంటరుగా రాబిన్ వ్యూహం ఉందని తెలుస్తోంది. మరి చూడాలి రాబిన్ వ్యూహాలు టీడీపీకి ఏ మేర ఉపయోగపడతాయో.

Share post:

Latest