ప‌వ‌న్ తో సినిమా అంటేనే హ‌డ‌లెత్తిపోతున్న‌ ద‌ర్శ‌కులు.. కార‌ణం?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు తహతహలాడుతుంటారు. కానీ ఇది ఒకప్పుడి మాట‌. ఇప్పుడు ఆయనతో సినిమా అంటేనే ద‌ర్శ‌కులు హడలెత్తిపోతున్నారు. అందుకు కారణం.. పవన్ ఒక్కో సినిమాను పూర్తి చేయడానికి రెండు మూడేళ్ల సమయం తీసుకోవడమే. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, పవన్ కాంబినేషన్లో పట్టాలెక్కిన `హరి హర వీరమల్లు` ఇందుకు నిదర్శనం. ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఎప్పుడో ప్రారంభమైంది.

కానీ ఈ మూవీ షూటింగ్‌కు ప‌వ‌న్ కార‌ణంగా అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. పవన్ రాజకీయాల్లో బిజీ అవడం వ‌ల్ల ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం అవుతూనే ఉంది. ఇప్పటికి కూడా ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో స్పష్టత రాని పరిస్థితి ఉంది. ఇక మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో `భవదీయుడు భగత్ సింగ్` అనే సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా కాలమే అయ్యింది.

కానీ ఇప్పటివరకు షూటింగ్ ప్రారంభం కాలేదు. వేరె ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టుకుండా పవన్ కోసం హరీష్ శంక‌ర్‌ వెయిట్ చేస్తూనే ఉన్నాడు. పవన్ మాత్రం ఆయనకు మోక్షాన్ని ప్రసాదించడం లేదు. ఇక ఈ రెండు ప్రాజెక్టులు కాకుండా మరికొన్ని చిత్రాలను సైతం పవన్ లైన్లో పెట్టాడు. అవి సైతం ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే పవన్ తో సినిమా అంటే దర్శకులు భయపడుతున్నారట. ఆయనతో సినిమాను ప్రకటించి ఎప్పుడు ప్రారంభమవుతుందో అని ప‌డిగాపులు కాసే కంటే ఖాళీగా ఉండటమే బెటర్ అని భావిస్తున్నారట.