`పుష్ప 2` మ‌రింత ఆల‌స్యం.. కార‌ణం బన్నీనే అట‌?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన హ్యాట్రిక్ మూవీ `పుష్ప ది రైజ్‌`. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రంలో రష్మిక‌ మందన్నా హీరోయిన్ గా నటించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 17న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై ఘ‌న విజయం సాధించింది.

దాదాపు అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా బ‌న్నీ ఈ సినిమాలో వన్ మాన్ షో చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు రెండో భాగంగా `పుప్ప ది రూల్` రాబోతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలోనే ఈ చిత్రం పట్టాలెక్కాల్సి ఉన్న సుకుమార్ స్క్రిప్ట్ లో ప‌లు మార్పులు, చేర్పులు చేయడం వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. ఇక ఎట్టకేలకు ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ఇటీవ‌ల‌ ప్రారంభించారు.

అయితే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యేలోపే బన్నీ ఫ్యామిలీతో సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు. పోనీ అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత అయినా షూటింగ్ స్టార్ట్ అవుతుందని భావించారు. కానీ `పుష్ప 2` మ‌రింత ఆల‌స్యం కానుంద‌ని లేటెస్ట్ స‌మాచారం ద్వారా తెలుస్తోంది. అందుకు కార‌ణం బ‌న్నీనే అట‌. పుష్ప 1 కోసం రష్యా రాజధాని మాస్కో కు బ‌న్నీ వెళ్లబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అక్కడ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ జరగబోతుంది. అందులో పుష్ప 1 సినిమాను స్క్రీనింగ్ చేసే అవకాశం దక్కింది. అందుకే అక్కడకు బ‌న్నీ వెళ్తున్నార‌ని తెలుస్తోంది.

Share post:

Latest