ఆ విషయంలో ప్రభాస్, మహేష్, పవన్, రామ్ చరణ్ అందరూ ఒక్కటేనని మీకు తెలుసా?

ఈ విషయాలు మీరు గమనించారో లేదో గాని, టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలైనటువంటి హీరోలలో ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్, బన్నీల గురించి తెలియని తెలుగు ఆడియన్స్ ఉండనే వుండరు, ఈ హీరోలలో ముఖ్యంగా ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మహేష్ మధ్య ఒక కామన్ పాయింట్ ఉందని ఎపుడైనా గమనించారా? అదేమంటే ఈ హీరోలు స్టేజ్ లపై, ఇంటర్వ్యూలలో ఎక్కువగా మాట్లాడటానికి ఎక్కువ ఇష్టం చూపరు. ఒకవేళ మాట్లాడవలసి వచ్చినా తక్కువగా హుందాతనంతో మాట్లాడుతూ వుంటారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలిసిందే. కెరీర్ తొలినాళ్లలో పవన్ ఏదైనా స్పీచ్ ఇవ్వాలంటే వీలైనంత త్వరగా స్పీచ్ ముగించడానికి ఇష్టపడేవారు. ఒకింత బిడియంగా మాట్లాడేవారు. ఇక పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ లో కూడా చాలా సింపుల్ గా వుంటారనే విషయం తెలిసిందే. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుని తీసుకుంటే ఎంతో అవసరమైతే తప్ప బయటకి మాట్లాడరు. ఈ సూపర్ స్టార్ ఆటిట్యూడ్ కు కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే.

అలాగే రామ్ చరణ్ సైతం ఇంటర్వ్యూలలో అవసరమైన ప్రశ్నలకు తప్ప అనవసరంగా అస్సలు మాట్లాడరు. వీలైనంత తక్కువగా మాట్లాడుతూ ముభావంగా వుంటారు చరణ్. మెగాస్టార్ చిరంజీవి కొడుకు అయినా సింపుల్ గా ఉండటానికి చరణ్ ప్రాధాన్యత ఇస్తారని మీలో ఎంతమందికి తెలుసు? ఇక చివరగా మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ కూడా ఎక్కువగా స్టేజిలమీద మాట్లాడిన దాఖలాలు లేవు. అంతెందుకు ప్రభాస్ ఇచ్చిన ఇంటర్వ్యూలు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు.

Share post:

Latest