తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే గొప్ప విషయం అనుకున్న ఆ రోజుల్లో..హీరో నుంచి మెగాస్టార్ గా మారి పలువురు హీరోస్ కి రోల్ మోడల్ గా నిలవడం తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించతగ్గ విషయం. కాగా ఇప్పటికీ తనదైన స్టైల్ లో హీరోగా సినిమాలలో నటిస్తున్న చిరంజీవి త్వరలోనే “వాల్తేరు వీరయ్య” గా అభిమానులు ముందుకు రాబోతున్నాడు .
సంక్రాంతి కానుకగా బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . కాగా రీసెంట్ గానే మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. కాగా ఇదే అవార్డు అందుకోవడానికి చిరంజీవి గోవాలో జరుగుతున్న 53వ Indian Film Festival of India కార్యక్రమానికి వెళ్లారు . అవార్డు అందుకున్న తర్వాత చిరంజీవి స్టేజ్ పై మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. అవార్డు ఫంక్షన్లో చిరంజీవి మాట్లాడిన అన్ని మాటలు బాగానే.. ఉన్నాయి. ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు .
అంతా బాగానే ఉన్నా చిరంజీవి లాస్ట్ లో ..”అవినీతి లేని ఏకైక రంగం మా సినిమా రంగం ” అని మాట్లాడడం ఇక్కడ చర్చనీయాంసంగా మారింది . అన్ని రంగాలలో అవినీతి ఉంటుంది అది అందరికీ తెలిసిందే . అయితే చిరంజీవి లాంటి పెద్ద హీరోకి ఇండస్ట్రీని క్యాస్టింగ్ కౌచ్ అనే ఓ మహమ్మారి పట్టి పీడిస్తున్న విషయం తెలియదా..? ఇప్పటికే ఎంతోమంది ఆడపిల్లలు మేం క్యాస్టింగ్ కౌచ్ కి బలయ్యాము అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు . ఆ మాటలు చిరంజీవి వినలేకపోయాడా ..? లేకపోతే విని విననట్లు వినిపించుకోలేదా..? అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు. సినీ ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉండే చిరంజీవినే కాస్టింగ్ కౌచ్ ను లైట్ గా తీసుకుంటే.. మరి మిగతా హీరోలు తీసుకోరా..? అంటూ క్యాస్టింగ్ కౌచ్ కి బలైన భాధితులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. చూడాలి దీనికి సమాధానం మెగా స్టార్ ఇస్తారో లేదో..?