పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆహార ప్రియుడు అన్న సంగతి తెలిసిందే. తాను తినడంలోనే కాదు ఇతరులకు పెట్టడంలోనూ ఆయనది పెద్ద చేయి. ఆయన ఆతిథ్యాన్ని ఒక్కసారి రుచి చూశారంటే జీవితంలో మరచిపోరు. సెలబ్రిటీలు సైతం ప్రభాస్ ఆతిథ్యాన్ని పై పొగడ్తలు వర్షం కురిపిస్తుంటారు.
అయితే ప్రభాస్ కు నాన్ వెజ్ అంటే మహా ఇష్టం. ఆయన నాన్ వెజ్ తోనే రోజును ప్రారంభిస్తారు. లంచ్, డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ ఏదైనా సరే నాన్ వెజ్ ఉండాల్సిందే. అయితే నాన్ వెజ్ తర్వాత ఆయన బాగా ఇష్టపడే ఐటెం పానీపూరి అట. అవును ప్రభాస్ పానీపూరి పిచ్చోడట. హీరో అవ్వడానికి ముందు రోడ్ సైడ్ ఎక్కడ పానీపూరి బండి కనిపించినా ఓ పట్టు పట్టేసేవాడట. పానీ పూరి ఎలా చేస్తారు..? ఏ వాటర్ తో చేశారు..? అనేవి ఏమి పట్టించుకునేవాడు కాదట. తినాలి అనుకున్నప్పుడు పుష్టిగా తినేసేవాడట.
అయితే స్టార్ అయిన తర్వాత మాత్రం అలా రోడ్ సైడ్ తినే స్వేచ్ఛను కోల్పోయాడు. కానీ ఇంటికే పానీ పూరిని తరచూ తెప్పించుకుని తింటుంటారట. కాగా సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో `ఆదిపురుష్` సినిమాను కంప్లీట్ చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ ఓవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్`, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో `ప్రాజెక్ట్ కె` చిత్రాలను చేస్తున్నాడు. అలాగే మారుతి దర్శకత్వంలో ఓ సినిమాను పట్టాలెక్కించాడంటూ వార్తలు వస్తున్నాయి.