ఓ మై గాడ్..మహేశ్ బాబు కి బట్ట తల.. విగ్గుతో కవర్ చేస్తున్నారా..? మేకప్ మెన్ సంచలన కామెంట్స్..!!

టాలీవుడ్ దిగ్గజ నటుడు నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ మరణం తర్వాత ఆయనకు సంబంధించిన ఎలాంటి వార్తలు బయటికి వచ్చిన తెగ వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా ఇప్పుడు కృష్ణ జుట్టు గురించి ఒక వార్త వైర‌ల్‌ అయింది. కృష్ణది సహజంగానే బట్టతల దీంతో ఆయన సినిమాల్లో విగ్గు ధరించేవారు. ఆయనకు చివరి వరకు మేకప్ మ్యాన్ గా పని చేసిన మాధవరావు కొన్ని సెన్సేషనల్ విషయాలు బయట పెట్టాడు. ఆయన బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుండి ఆయన చివరి సినిమా శ్రీ శ్రీ వరకు మాధవరావే కృష్ణ‌కు మేకప్ మ్యాన్ గా పని చేశారు. కృష్ణ మరణించిన తర్వాత ఆయనతో ఉన్న తన అనుబంధాన్ని తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

 

ఈ ఇంటర్వ్యూలో మాధవరావు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు..కృష్ణ మరణించిన టైంలో కూడా మాధవరావు ఆయన పక్కనే ఉన్నారు. ఆయన పార్థివ దేహాన్ని తుడిచి చివరిసారిగా ఆయనకు మేకప్ వేసి తన అనుబంధాన్ని తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఆయనతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే కృష్ణకు జుట్టూ ఉన్నప్పటి నుంచి విగ్గు వాడేవారని ఆయన చెప్పుకొచ్చాడు. ఆయన నటించిన అసాధ్యుడు సినిమాకు కృష్ణ మొదటిసారిగా విగ్గు పెట్టుకున్నాడు.. ఆ సినిమాలో తన హెయిర్ స్టైల్ బాగా నచ్చటంతో ప్రతి సినిమాలోను అదే హెయిర్ స్టైల్ కొనసాగించేవారు.. అయితే ఎక్కువగా విగ్గు పెట్టకపోవడం వలన కృష్ణకు తొందరగానే బట్టతల వచ్చేసింది. అయినా ఏమాత్రం ఆందోళన చెందకుడా సినిమాల కోసం విగ్గు పెట్టుకునేవారు.

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన మహేష్ బాబు కూడా తన సినిమాల కోసం విగ్గు వాడుతున్నట్లు మాదారావు చెప్పారు. మహేష్ బాబుకు మేకప్ మ్యాన్ గా తన మేనల్లుడు పట్టాభి పనిచేస్తున్నాడని.. మహేష్ బాబు తలపై పల్చటి వెంట్రుకలు ఉంటాయి. దీంతో ఆయనకు ప్రతి సినిమాకు విగ్గు అవసరం ఉంటుందని అని చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు తన జుట్టుకి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాడని కూడా ఆ ఇంటర్వ్యూలో అయ‌న‌ చెప్పాడు. అయినా కొన్ని సినిమాలలో విగ్గు వాడారని ఆయన చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు గురించి ఎవ‌రికి తెలియని ఈ నిజాన్ని మాధవరావు ఆ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.

 

Share post:

Latest