తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో హీరోయిన్లు తమ నటనతో స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్నారు. వారిలో కొందరు హీరోయిన్లు మాత్రం తమ నటనతో ప్రేక్షకులకు చిరాకు తెప్పించారు. వారు నటించిన కొన్ని సినిమాలు హిట్ అయిన మరికొన్ని సినిమాలు ఫెయిల్ అయ్యాయి. అయితే ఆ సినిమాలో నటించిన హీరోయిన్ల పాత్రలు మాత్రం తమకు అసలు నచ్చలేదని చాలామంది నెటిజెన్లు సోషల్ మీడియా ద్వారా అభిప్రాయపడ్డారు. కొన్ని సినిమాలలో పాత్రలు అయితే ఆ హీరోయిన్ల అభిమానులకు కూడా నచ్చలేదు అంటే ఆ పాత్రలు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.
మహేష్ బాబు క్రేజీ డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబోలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబుకిి జోడిగా రష్మిక మందన్న నటించారనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక మాత్రం సినిమాకు మైనస్ అయింది తప్ప ప్లస్ కాలేదు. ఈ సినిమాలో రష్మిక చేసే ఓవర్ యాక్టింగ్ డైలాగ్స్ సినిమాలో అతిగా అనిపిస్తాయి.
ఈ సంవత్సరం అత్యంత భారీ బడ్జెట్ తో విడుదలైన సినిమాలలో లైగర్ సినిమా ఒకటి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా అనన్య పాండే నటించింది. ఈ సినిమా మోదటి ఆట నుంచి భారీ ప్లాప్ టాక్ తెచ్చుకుని విజయ్ దేవరకొండ కెరియర్ లోనే అత్యంత చేత సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అనన్య పాండే పాత్ర కూడా సినిమాకు మైనస్ అయింది. నాగచైతన్య హీరోగా సోగ్గాడే చిన్నినాయ వంటి సూపర్ హిట్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా నాగచైతన్య కెరియర్ లోనే సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ సినిమా హిట్ అయిన కూడా ఆమె క్యారెక్టర్ ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మగధీర సినిమా లాంటి భారీ హిట్ తర్వాత ఆయన నటించిన ఆరెంజ్ సినిమా ఎవరు ఊహించిన విధంగా ప్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమా విడుదలకు ముందు పాటలన్నీ సూపర్ హిట్ అవ్వగా… సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి. సినిమా విడుదలై మొదటి ఆట నుంచి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్లాప్ అవటానికి ప్రధాన కారణం ఇందులో రామ్ చరణ్ కు జోడిగా నటించిన జెనీలియా పాత్ర కూడా ఒక కారణం అనే సంగతి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన సీత సినిమాలో కాజల్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో తన యాక్టింగ్ ప్రేక్షకులకు చిరాకు తెప్పించే విధంగా ఉంటుంది. అయితే ఈ సినిమాలోని క్యారెక్టర్ల విషయంలో మాత్రం ప్రేక్షకులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ రకంగా తమ పాత్రలతో చిరాకు తెప్పించిన హీరోయిన్లు వీళ్లే.