టాలీవుడ్లో విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు నటుడు అడవి శేష్. అతి తక్కువ వయసులోని పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సంపాదించారు. చివరిగా మేజర్ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న అడవి శేష్ తాజాగా హిట్ -2 సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం మొదటి భాగం విశ్వక్ సేన్ హీరోగా నటించారు ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందించింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలవ్వడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.
హిట్-2 సినిమా విశాఖపట్నం నేపథ్యంలో తెరకెక్కించడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మొదటి భాగాన్ని మించి ఉంటుందని ఈ ట్రైలర్ ని చూస్తే మనకి అర్థమవుతోంది. ఈ ట్రైలర్ చూస్తూ ఉంటే చాలా భయానకనంగా కనిపిస్తుంది. టీజర్ ను మించిపోయి హిట్-2 ట్రైలర్ ఉన్నది. ఇందులో హంతకుడు చేసే మర్డర్లు చాలా భయానకంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది ఈ చిత్రం డిసెంబర్ రెండవ తేదీన విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి నిర్మాతగా నాని వ్యవహరిస్తూ ఉన్నారు.
అడవి శేష్ కు జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తోంది సంగీతాన్ని ఎం ఎం శ్రీలేఖ , సురేఖ బొబ్బిలి అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ట్రైలర్ లో కోడి బుర్రలు అనే కథ అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. రావు రమేష్ కూడా ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. మరి హిట్ -2 చిత్రంలో అడవి శేషు ఎలాంటి కేసును సాల్వ్ చేస్తారు అనే విషయం తెలియాలి అంటే డిసెంబర్ రెండవ తేదీ వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ ట్రైలర్ వైరల్ గా మారుతోంది.