రీ రిలీజ్ కు సిద్ధమైన ఎన్టీఆర్ మాయాబజార్..!!

తెలుగు సినీ పరిశ్రమలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన అద్భుతమైన చిత్రాలలో మాయాబజార్ చిత్రం కూడా ఒకటి . ఎన్ని తరాలు మారిన ఈ చిత్రం యొక్క చరిత్ర ఇప్పటికీ మారలేదని చెప్పవచ్చు. ఇప్పటికీ ఈ సినిమా హవా కొనసాగుతోంది. ఇలాంటి అద్భుత దృశ్య కావ్యాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచన రావడం అభినందనీయం. 1957 మార్చి 27న విడుదలైన మాయాబజార్ చిత్రం ఇప్పటికీ 65 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా టీవీలలో బ్లాక్ అండ్ వైట్ లలో చూసిన వారు కూడా థియేటర్లో అద్భుతాన్ని చూసి అవకాశం రావడం ఇప్పుడు అదృష్టం అని చెప్పవచ్చు.

Mayabazar' retro review: This Sr NTR, ANR starrer is a must-watch | Deccan  Heraldమాయాబజార్ చిత్రాన్ని గోల్డ్ స్టోన్ టెక్నాలజీ వారు కలర్ మరియు డిజిటల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని మార్చడానికి వీలుపడని కొన్ని సీన్లను వదిలేసారట. 2010 జనవరి 30 న కలర్ వెర్షన్ విడుదల చేయగా.. చూసిన వాళ్లంతా కన్వర్ట్ చేసినవాళ్ల ప్రయత్నం అనేది మెచ్చుకోదగ్గదే కానీ సీన్లు తీయడం వల్ల సోల్ మిస్ అయిందని చెప్పుకు రావడం జరిగింది. దీంతో ఇప్పుడు మరొకసారి ఈ చిత్రానికి మెరుగులు దిద్ది మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

మాయాబజార్ చిత్రం డిసెంబర్ 9వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని ఏరియాలలో విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించి.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంధ్య -35 MM థియేటర్లలో, అలాగే కూకట్ పల్లి విశ్వనాథ లాంటి సింగిల్ స్క్రీన్ తో పాటు, మూసాపేట లక్ష్మీ కళ, ప్రసాద్ ఐమాక్స్, గచ్చిబౌలి AMB సినిమాస్ తో పాటు అన్ని పాపులర్ మల్టీప్లెక్స్ లో కూడా మాయాబజార్ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, సావిత్రి ఎంతో అద్భుతంగా నటించారు.