చిరంజీవి విషయంలో తప్పు నాదే..సంచలన విషయాని బయటపెట్టిన మణిశర్మ..!!

టాలీవుడ్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పేరు చెప్పగానే ఎన్నో అద్భుతమైన మెలోడీ పాటలు గుర్తుకు వస్తాయి. ఇప్పటికీ కూడా ఆయన అందించిన పాటలు సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుత కాలంలో ఆయనకు అవకాశాలు తగ్గినా కూడా.. ఒకటి రెండు సినిమాలకు సంగీతం అందిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ సినిమాలకు మ్యూజిక్ అందించిన మణిశర్మ.. చాలాకాలం తర్వాత టాలీవుడ్ స్టార్ట్ దర్శకుడు కొరటాల శివ కాంబోలో వచ్చిన ఆచార్య సినిమాకు మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా ఎలా ఉన్నప్పటికీ సినిమాలో పాటలన్నీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఎప్పుడూ ఏ రియాల్టీ షోలో కనిపించిన ఈ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్.. రీసెంట్గా ఓ టాక్ షోలో సందడి చేశారు. టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న ఆలీతో సరదాగా షో కు మణిశర్మ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ షోలో తన కెరియర్ గురించి.. తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను ఆలీతో పంచుకున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Alitho Saradhaga Mani Sharma : మెగాస్టార్ చిరంజీవికి ఇష్టం లేకపోయినా ఆ పని చేశా.. మణిశర్మ కామెంట్స్ వైరల్

ఈ ప్రోమోలో మణిశర్మ మాట్లాడుతూ.. ‘తాను సంగీతం నేర్చుకునే విషయంలో తన తండ్రి పండితుడని..తాను పరమ శుంఠనని ఆయన సరదాగా అనేవారు.. అలాగే చిరంజీవికి ఇష్టం లేకపోయినా ఆయన నటించిన చూడాలని వుంది సినిమాలో లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమహ్మణ్యాన్ని కాకుండా ఆయనను తప్పించి ఉదిత్ నారాయణతో రామా చిలకమ్మా పాటని ఎందుకు పాడించాల్సి వచ్చిందో చెప్పారు’.. ‘ఏఆర్ రెహమాన్ దగ్గర నేను కీబోర్డ్ ప్లేయర్గా పనిచేసినట్లు కూడాా చెప్పుకొచ్చారు’. ఇక చివరిగా థ‌మన్ వచ్చిన తర్వాత మణిశర్మ అక్కర్లేదు అనుకునే వాళ్లకి మీ సమాధానం ఏమిటి అని అడగగా… ‘కాలమే సమాధానం ఇస్తుందని ఆయన అన్నారు’. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.

Share post:

Latest